Ad Code

జస్ట్ మిస్...!


టోక్యో ఒలింపిక్స్ లో  భారత గోల్ఫ్ క్రీడాకారిని అదితి అశోక్ అనూహ్య రీతిలో పతకం మిస్ అయింది. ఓవరాల్ గా నాలుగో స్థానంలో నిలిచి, పతకాన్ని మిస్ అయింది. గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్‌ ఉత్కంఠభరింతంగా సాగింది. తుది వరకు  పోరాడిన భారత గోల్ఫర్ అదితి అశోక్ చివరికి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో అదితి అశోక్ కొంచెం ఇబ్బందులు ఎదుర్కోంది.  వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా కి బంగారు పతకం దక్కింది. మోనో ఇనామీ, లియాడో కో రజత, కాంస్య పతకాలు కోసం పోటీపడుతున్నారు. గత మూడు రోజులుగా నిలకడగా రాణించినా అదితికి ఇనామీ, లియాడో కో నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా అదితి చరిత్ర సృష్టించింది. ఓ భారత గోల్ఫర్ ఇలా ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఇక అదితి అశోక్ 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. తద్వారా ఒలింపిక్స్ బరిలో దిగిన అతి పిన్న గోల్ఫర్‌గా రికార్డుకెక్కింది. అదితి అశోక్‌ది గోల్ఫ్ బ్యాక్ రౌండ్ నుంచి రాలేదు. ఓ రెస్టారెంట్ విండో నుంచి 5 ఏళ్ల వయసులో తొలిసారి ఈ ఆటను చూసింది. ఆమెకు ఈ ఆట నచ్చడంతో తన తండ్రి ప్రోత్సహించారు.

Post a Comment

0 Comments

Close Menu