Header Ads Widget

ఏనుగు ప్రాణాలు కాపాడిన లోకో పైలెట్లు

ఓ రైలు లోకోపైలెట్‌లు గజరాజును రక్షించారు. అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్‌ ఉత్తర బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లా పరిధిలోకి వచ్చేసరికి ట్రాక్ పక్కన ఓ ఏనుగు నిలబడి ఉంది. దూరం నుంచి దాన్ని గమనించిన ఇద్దరు లోకోపైలెట్లు వెంటనే అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపేశారు. ఏనుగు ట్రాక్ దగ్గరి నుంచి అడవి లోపలికి వెళ్లేవరకు వేచి చూశారు. ఏనుగు వెళ్లిపోయాక రైలును ముందుకు పోనిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అలీపూర్‌ద్వార్ డివిజన్ అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు లోకో పైలెట్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమయానికి అప్రమత్తంగా వ్యవహరించి ఏనుగు ప్రాణాలను కాపాడారంటూ మెచ్చుకుంటున్నారు. రైల్వే శాఖ కూడా ఆ ఇద్దరు లోకో పైలెట్‌లను అభినందించింది.

Post a Comment

0 Comments