Ad Code

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ బైక్‌

 


ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఆగస్టు 15న ఓలా రిలీజ్ చేసిన రోజే.. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ సింపుల్ ఎనర్జీ కూడా సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను రిలీజ్ చేసింది. ఈ స్కూటర్‌ను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని.. రూ.1947 పే చేసి సింపుల్ ఎనర్జీ కంపెనీ వెబ్‌సైట్‌లో బైక్‌ను బుక్ చేసుకోవచ్చని.. కంపెనీ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. బైక్‌ను రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి 30 వేల ప్రీ బుకింగ్స్ వచ్చాయట. ఎటువంటి మార్కెటింగ్ చేయకుండానే.. జీరో మార్కెటింగ్‌తో కంపెనీకి 30 వేల ప్రీ బుకింగ్స్ వచ్చాయి. మమ్మల్ని నమ్మిన కస్టమర్లకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఎదుగుతున్న మాకు.. మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా గొప్పది.. అని సింపుల్ ఎనర్జీ సీఈవో సుహాస్ రాజ్‌కుమార్ తెలిపారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రెడ్, బ్లూ, వైట్‌, బ్లాక్ కలర్స్‌లో లభించనుంది. మొదటి ఫేజ్‌లో భాగంగా. కంపెనీ 13 రాష్ట్రాల్లో స్కూటర్లను డెలివరీ చేయనుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, గోవా, ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో సింపుల్ వన్ స్కూటర్‌ను డెలివరీ చేస్తారు. మొదటి ఫేజ్ తర్వాత మిగితా రాష్ట్రాల్లో సింపుల్ వన్ స్కూటర్‌ను లాంచ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది. సింపుల్ వన్.. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అయితే.. అది ఐడియల్ డ్రైవింగ్ కండీషన్ మోడ్‌లో సింగిల్ చార్జ్ చేస్తే అంత మైలేజ్ వస్తుంది. ఒకవేళ ఈకో మోడ్‌లో అయితే.. 203 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే.. 105 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్‌తో స్కూటర్ వెళ్తుంది. 0 నుంచి 50 కేఎంపీహెచ్ స్పీడ్‌ను అందుకోవడానికి కేవలం 3.6 సెకన్లు పడుతుంది. 0 నుంచి 40 కేఎంపీహెచ్ స్పీడ్‌ను అందుకోవడానికి 3.6 సెకన్లు పడుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu