Ad Code

భారీ లాభాలను గడించిన డ్రీమ్‌-11

ప్రముఖ వెబ్ ఆధారిత ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్-11 లాభాలను గడించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ .180 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. భారత్‌లో డ్రీమ్‌-11 ఫాంటసీ గేమింగ్‌ విభాగంలో యునికార్న్‌ సంస్థగా నిలిచింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 87 కోట్ల నష్టాలను చవిచూసింది. డ్రీమ్‌-11 నిర్వహిస్తున్న స్పోర్ట్టా టెక్నాలజీస్‌ 2020 ఆర్థిక సంవత్సరంలో 2.5 రెట్లు గణనీయ వృద్ధిని నమోదుచేసింది. 2019లో డ్రీమ్‌-11 ఆదాయం సుమారు రూ. 775.5 కోట్ల నుంచి 2020లో రూ. 2,070 కోట్ల వరకు పెరిగింది. ఈ రేంజ్‌లో కంపెనీ ఆదాయ అభివృద్దికి వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు కలిసివచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu