Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, September 21, 2021

ఆటో డ్రైవర్ కి లాటరీలో రూ .12 కోట్లు

 



కేరళ కొచ్చికి చెందిన ఆటో డ్రైవర్.300 రూపాయలతో లాటరీ టికెట్ కొని 12 కోట్ల విలువైన ఓనం బంపర్ కేరళ లాటరీని గెలుచుకున్నాడు. ఈ ఏడాది కేరళ ఓనమ్ బంపర్ లాటరీ విజేత కొచ్చిలోని మరడు పూప్పనపరంబిల్ హౌస్ నివాసి జయపాలన్ పిఆర్. జయపాలన్ మరాడులోని అంబేద్కర్ జంక్షన్ ఆటో స్టాండ్‌లో ఆటో డ్రైవర్. అతను కొట్టారం భగవతి దేవాలయం సమీపంలో నివసిస్తున్నాడు. కన్నన్ అని పిలవబడే, జయపాలన్ కి 95 ఏళ్ల తల్లి, భార్య, ఇద్దరు సంతానం. జయపాలన్ భార్య మణి చోట్టనిక్కర హోమియో ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుండగా, వైశాఖ్ ఎలక్ట్రీషియన్‌గా, విష్ణు హోమియో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. లాటరీ ద్వారా అతడు గెలుచుకున్న రూ.12 లక్ష్లల్లో పన్నులు, ఏజెంట్ కమీషన్ పోను జయపాలన్ సుమారు రూ .7.39 కోట్లు పొందాడు.  ఆ డబ్బుతో "తాను అంతకు ముందే తీసుకున్న వాహన రుణం, గృహ రుణ తీర్చేస్తానంటున్నాడు. నా కుటుంబంతో చర్చించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఏం చేయాలో నిర్ణయించుకుంటాను అని చెబుతున్నాడు. 

No comments:

Post a Comment

Popular Posts