Ad Code

పౌరుల తొలి అంతరిక్ష యాత్ర సెప్టెంబర్ 15న

 

స్పేస్‌ఎక్స్‌ మిషన్‌ ద్వారా తొలిసారి అంతరిక్షంలోకి పౌరులు వెళ్లేందుకు అంతా సిద్ధమైంది. ఈ నెల 15 న 'ఇన్‌స్పిరేషన్ 4' కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. బిలియనీర్ ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్‌ఎక్స్ మిషన్‌ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎలోన్‌ మస్క్‌తో పాటు ఐదుగురు అంతరిక్ష యాత్ర చేసి విజయవంతంగా తిరిగొచ్చారు. దాంతో అంతా పౌరులే వెళ్లే మిషన్‌కు స్పేస్‌ ఎక్స్‌ సంస్థ పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 15 న ఇన్‌స్పిరేషన్ 4 మిషన్ బయల్దేరుతుందని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఒక ట్వీట్‌లో పేర్కొన్నది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లోని నాసా ప్యాడ్‌ 39 ఏ నుంచి స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ నింగిలోనికి దూసుకుపోనున్నది. మిషన్‌ ప్రారంభానికి కొన్నిరోజుల ముందే లిఫ్ట్‌ ఆఫ్‌ సమయం నిర్ణయించనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌ను స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. దీనిని టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ జారెడ్ ఐజాక్‌మాన్ కమాండర్‌గా వ్యవహరించనున్నారు. మరో ముగ్గురు సభ్యులు కూడా మిషన్‌లో ఉంటారు. 37 ఏండ్ల ఐజాక్‌మాన్‌కు గతంలో పైలట్‌గా పనిచేసిన అనుభవం ఉన్నది. ఆయన షిఫ్ట్‌4 పేమెంట్స్‌ కంపెనీ వ్యవస్థాపక సీఈఓగా ఉన్నారు. సెయింట్‌ జూడ్‌ చిన్నారుల దవాఖాన, పరిశోధనా కేంద్రం కోసం నిధులు సమీకరించే ప్రయత్నంలో భాగంగా ఐజాక్‌మాన్‌.. ఈ యాత్రలో సెయింట్‌ జూడ్‌ సంస్థకు రెండు టికెట్లు ఇచ్చాడు. ఈ టికెట్లను అమ్మడం ద్వారా 100 మిలియన్‌ డాలర్లు సేకరించాలన్నది ఐజాక్‌మాన్‌ ఉద్దేశం.ఇన్‌స్పిరేషన్‌ 4 లో ఐజాక్‌మాన్‌తోపాటు హేలీ అర్కెనాక్స్‌, సియాన్‌ ప్రొక్టర్‌, క్రిస్‌ సెంబ్రోస్కిలు కూడా ఈ మిషన్‌లో చేరారు. వీరు కస్టమైజ్‌ చేసిన విమాన మార్గం వెంట ప్రతి 90 నిమిషాలకు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌పై గ్రహం చుట్టూ తిరుగుతారు. మూడు రోజుల ప్రయాణం ముగిసిన తర్వాత, డ్రాగన్ క్యాప్సూల్‌ ఫ్లోరిడా తీరంలో ల్యాండై.. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుందని సంస్థ వెల్లడించింది. Ax-1 మిషన్‌ నలుగురు ప్రైవేట్‌ వ్యోమగాములకు ఆతిథ్యమిస్తుంది. ఐఎస్‌ఎస్‌కు వెళ్లేందుకు 8 రోజుల ట్రిప్‌కు ఒక్కొక్కరు 55 మిలియన్‌ డాలర్లు చెల్లించనున్నారు. జపాన్‌కు చెందిన బిలియనీర్‌ యుసాకు మేజావాతో కలిసి స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ సిస్టం 'స్టార్‌షిప్‌'లో చంద్రుడి చుట్టూ ప్రయాణించనున్నట్లు 2018 లో ఎలోన్‌ మస్క్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu