Ad Code

వేప పుల్లల ఖరీదు రూ.1,825 ..!


ఒక ఇ-కామర్స్ కంపెనీ వేప పుల్లలను ఇలా సేంద్రీయ టూత్ బ్రష్‌లుగా విక్రయిస్తోంది. వేప చెట్టు పొలాలు అనే సంస్థ వేప పుల్లలను $ 24.99 (రూ .1,825.34) కు విక్రయిస్తోంది. చాలా దేశాల్లో ఈ వేప పుల్లలను ఉపయోగిస్తారని తమ సంస్థ వెబ్​సైట్లో పేర్కింది. దంతాలు శుభ్రపరచడానికి, ప్రకాశవంతంగా చేయడానికి ఈ వేప పుల్లను ఉపయోగించొచ్చని సంస్థ పేర్కొంది. అంతేకాదు ఈ వేప పుల్లలను ఎలా వాడాలో కూడా సదరు సంస్థ వివరిస్తోంది. అంతేకాందు ఆ పుల్లలు దాదాపు 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపింది. రూ.1,825కి ఒక్కో డబ్బాలో 15 నుంచి 25 పుల్లల వరకు వస్తాయని చెప్పింది. కాగా, ఇలా పుల్లలు అమ్మడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ వేప పుల్లలను ఆన్​లైన్​లో అమ్మారు. ఈ విషయాన్ని 2020లో ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయెంకా తన ట్విటర్​ అకౌంట్​లోనూ పోస్టు చేశాడు. అక్కడి సంస్థలు 15 డాలర్లకు అమెరికాలో వేప పుల్లలు అమ్ముతున్నట్లు తెలిపాడు.

Post a Comment

0 Comments

Close Menu