Ad Code

విమానాలు తెల్లగానే ఎందుకు ఉంటాయి ?


ఈ రోజు మీరు తెల్లని విమానాలను చూస్తున్నారు. కానీ ఒకప్పుడు విమానాలు నల్లగా ఉండేవి. తెల్లని విమానం చాలా అసాధారణమైనదిగా అప్పట్లో పరిగణించేవారు. గతంలో, పాన్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ వంటి అనేక విమానయాన సంస్థలు మెటల్‌తో చేసిన నల్ల విమానాలను ఎంచుకున్నాయి. దానిపై వేరే రంగు లేదు. అలాంటి విమానాలు ఇప్పుడు కనిపించవు. ఈ రోజు, విమానాలు పూర్తిగా సర్వీస్ నుండి తీసివేశారు. అసలు నల్లటి విమానాలను ఎందుకు అప్పట్లో ఎంచుకున్నారంటే.. విమానంలో ఏదైనా విరిగిపోయినా లేదా పగిలినా, అది పెయింట్ చేయబడిన విమానంలో సులభంగా కనిపించదు. కానీ మెటల్‌ విమానం ఎక్కేటప్పుడు ఏదైనా సమస్య ఉంటే, దానిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఆపై సమస్య పరిష్కరించవచ్చు. ఈ విమానాలు కొంతకాలం తర్వాత విమానయాన సంస్థలు సేవ నుండి తీసివేశాయి. మెటల్‌ విమానం స్థానంలో తెల్లటి విమానం వచ్చింది. నిజానికి తెలుపు రంగు కంటే నలుపు ధర చాలా ఎక్కువ.

మెటల్ ప్లేన్ నల్లగా పెయింట్ చేయబడితే, చాలా పెయింట్ ఖర్చు అవుతుంది. అలా చేయడం వల్ల విమానం బరువు కూడా పెరుగుతుంది. బోయింగ్ 747 వంటి విమానానికి నల్లరంగు వేయాలంటే అనేక కిలోగ్రాముల పెయింట్ పడుతుంది. దాని బరువును 250 కిలోగ్రాములకు పెంచుతుంది. విమానం రంగు ఎంత ముదురు రంగులో ఉంటుందో, అంత బరువుగా ఉంటుందని విమానయాన సంస్థలు భావించాయి. అదనంగా, తెలుపు సూర్య కిరణాలను సరిగ్గా ప్రతిబింబిస్తుంది. విమానం జీవితాన్ని పొడిగించడంలో కూడా అవి ఉపయోగపడతాయి. మిగిలిన రంగులు వేలిసిపోయే అవకాశం చాలా ఎక్కువ. కానీ, తెలుపు రంగు ఎప్పటికీ మసకబారదు.

ప్రతి విమానం తెల్లగా ఉండాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్పారు. ఇప్పుడు కూడా, కె ఎల్ ఎం నేషనల్ ఎయిర్‌లైన్స్ నెదర్లాండ్స్ తన విమానం పైభాగాన్ని లేత నీలం రంగులో పెయింట్ చేస్తుంది. అలాగే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, బడ్జెట్ విమానయాన సంస్థ. ఈ ఎయిర్‌లైన్ ఎల్లప్పుడూ బంగారం, నీలం, ఎరుపు రంగులలో ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu