Ad Code

టాప్‌లో మారుతి..!


వివిధ మోడల్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్ సహా మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) కార్ల సేల్స్‌లో మారుతి సుజుకివే అధికం. సెడాన్ సెగ్మెంట్‌లో మాత్రం హోండా అమేజ్ వేరియంట్ టాప్‌లో ఉంది. గత నెలలో దేశంలోకల్లా కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి బాలెనోది తొలిస్థానం. 2020 ఆగస్టుతో పోలిస్తే 46 శాతం వృద్ధి చెందింది. గత నెలలో బాలెనో కార్లు 15,646 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆల్టో మోడల్ కార్ల సేల్స్ మాత్రం 8 శాతం తగ్గాయి. 2020 ఆగస్టులో 14,397 యూనిట్లు విక్రయిస్తే, గత నెలలో 13,236 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

టాప్‌లో స్విఫ్ట్‌.. వాగన్ఆర్

కంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ సేల్స్ 16 శాతం వృద్ధితో 12,483 యూనిట్ల నుంచి 14,869 యూనిట్లకు పెరిగాయి. రైడింగ్ హ్యాచ్‌బ్యాక్ వాగన్-ఆర్ కారు హ్యాచ్‌బ్యాక్ కార్ల సేల్స్‌లో నాలుగో స్థానంలో ఉంది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్లు 8,023 యూనిట్లు అమ్ముడయ్యాయి.

డిజైర్‌పై అమేజ్ పైచేయి

సెడాన్ వేరియంట్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి డిజైర్‌పై హోండా అమేజ్ పై చేయి సాధించింది. గత నెలలో డిజైర్ వేరియంట్ 5,714 యూనిట్లు అమ్ముడయ్యాయి. హోండా అమేజ్ 6,591 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఆగస్టులో 2,29 హోండా సిటీ కార్లు అమ్ముడైతే, గతనెలలో 3,094 యూనిట్లు సేల్ అయ్యాయి. గతేడాది హోండా ఔరా సేల్స్ 3,228 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 3,094 యూనిట్లకు పరిమితమైంది. మిడ్ సెడాన్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి సియాజ్ సెకండ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

విటారా బ్రెజాకు ఫుల్ గిరాకీ

మారుతి సుజుకి విటారా బ్రెజా మోడల్ కార్ల విక్రయంలో 87 శాతం వృద్ధి నమోదైంది. 2020 ఆగస్టులో కేవలం 6,903 యూనిట్లు విక్రయిస్తే, గత నెలలో 12,906 కార్లు అమ్ముడయ్యాయి. టాటా నెక్సన్ 93 శాతం గ్రోత్ రికార్డు చేసుకుంది. 2020 ఆగస్టులో 5,179 కార్లు అమ్ముడైతే గత నెలలో 10,006 యూనిట్లకు చేరాయి.

ఎంవీపీలోనూ టాప్‌లో మారుతి

మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) సెగ్మెంట్‌లోనూ మారుతి సుజుకి ఎకో ఓమ్నీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. వార్షిక ప్రాతిపదికన గతేడాది 9,115 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 10,666 కార్ల సేల్స్‌తో 17 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఎర్టిగా సేల్స్ 33 శాతం పడిపోయాయి. 2020 ఆగస్టులో 9302 యూనిట్లు విక్రయిస్తే, గత నెలలో 6,251 యూనిట్లకు పరిమితమైంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) గతేడాది 2,943 కార్లు విక్రయిస్తే గత నెలలో 5,755 యూనిట్లకు దూసుకెళ్లి 96 శాతం వృద్ధి నమోదు చేసింది.

Post a Comment

0 Comments

Close Menu