Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, September 26, 2021

గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

హైదరాబాద్‌ నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్‌ (42)గా గుర్తించారు. ఘటనాస్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతడి ఇల్లు ఉంది. షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్‌.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. వర్షపు నీటితో నిండి దారి కనిపించకపోవడంతో గుంతలో పడ్డారు. రజనీకాంత్‌ కోసం 2 డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపు కొనసాగిస్తున్నారు. మణికొండలో ఘటనాస్థలిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. 

No comments:

Post a Comment

Popular Posts