Ad Code

ఈడీ ఎదుట హాజరుకానున్న ఛార్మిడ్రగ్స్ కేసులో రేపు ఈడీ ఎదుట నటి చార్మి హాజరు కానున్నారు. ఇప్పటికే చార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మి అకౌంట్స్ ను పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందా అనే దాని మీద, అలాగే  చార్మీ ప్రొడక్షన్ హౌజ్ ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీయనున్నారు. ఎంత కాలంగా కెల్విన్ తో ఛార్మికి పరిచయం, డ్రగ్స్ సేవించారా కెల్విన్ తో పాటు సరఫరాకు కూడా సహకరించారా అన్న కోణంలో విచారించనున్నారు. అసలు ఎన్నిసార్లు ఛార్మి కెల్విన్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేసింది. అనేక కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ ఈడీ చేయనున్నది.

Post a Comment

0 Comments

Close Menu