Ad Code

ధరలు పెరగనున్న హీరో బైకులు

 

మీరు పండుగ సమయంలో కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీరు చేదు వార్త. దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ఈ పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రానున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న విడిభాగాల వస్తువుల ధరల వల్ల ద్విచక్ర వాహన ధరలను పెంచాల్సి వస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల పెంపు అనేది రూ.3,000 వరకు ఉండనుంది. బైక్, స్కూటర్ వేరియంట్ బట్టి ధరలు పెరగనున్నాయి. రోబోయే పండుగ సీజన్ ముందు ధరలు పెంచడం విశేషం. ఈ పండుగ సీజన్​లో డిమాండ్ ఆశాజనకంగా ఉంటుంది అని కంపెనీ భావిస్తుంది. హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 1.80 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది క్రితం కాలంలో విక్రయించిన 1.61 మిలియన్ యూనిట్లకంటే సుమారు 12శాతం ఎక్కువ. ఈ ఏడాది కూడా గత ఏడాది మాదిరిగానే ఉత్పత్తి, అమ్మకాలు కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం చెందాయి.

Post a Comment

0 Comments

Close Menu