స్మార్ట్‌ఫోన్ యూజర్లలో చాలామంది తమ ఫోన్ స్లోగా ఉందని, ఊరికే హ్యాంగ్ అవుతోందని చెబుతుంటారు. స్మార్ట్‌ఫోన్‌ను ఫాస్ట్‌గా, స్మూత్‌గా మార్చడం మీ చేతిలో పనే. స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మీ ఫోన్ ఇప్పటికన్నా వేగంగా పనిచేస్తుంది. అయితే చాలామందికి ఆ సెట్టింగ్స్ గురించి తెలియక తమ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో మూడు టిప్స్ పాటిస్తే చాలు. స్మార్ట్‌ఫోన్ పెర్ఫామెన్స్‌ను పెంచుకోవచ్చు. మామూలుగా స్మార్ట్‌ఫోన్ ఎక్కువకాలం ఉపయోగిస్తే ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే తరచూ ఈ టిప్స్ పాటిస్తే స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ స్మూత్‌గా మార్చొచ్చు.
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో About ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిందో లేదో చూడండి. లేకపోతే మీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడానికి 15 నిమిషాలు పట్టొచ్చు. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి manage apps and device పైన క్లిక్ చేయండి. అందులో యాప్స్ ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉన్నయామో చూడండి. ఉంటె అన్ని యాప్స్ అప్‌డేట్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో యానిమేషన్స్ ఉంటే స్లోగా ఆపరేట్ అవుతుంది. పాత స్మార్ట్‌ఫోన్స్‌లో యానిమేషన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి About పైన క్లిక్ చేయండి. Build number పైన ఏడు సార్లు ట్యాప్ చేయండి. డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో, సిస్టమ్స్‌లో డెవలపర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి. ఇక మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. Manage Storage పైన క్లిక్ చేయండి. అవసరం లేని ఫైల్స్, యాప్స్ డిలిట్ చేయండి. ముఖ్యమైన ఫైల్స్ ఎక్కువగా ఉంటే మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోండి. లేదా మెమొరీ కార్డులో ట్రాన్స్‌ఫర్ చేయండి. ఈ మూడు టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ పెర్ఫామెన్స్ వేగంగా, స్మూత్‌గా మారుతుంది.
No comments:
Post a Comment