Ad Code

తొలి తెలుగు సాహితి సదస్సు కెనడాలో...!


కెనడా ప్రధాన కేంద్రంగా మొదటి కెనడా తెలుగు సాహితి సదస్సు, 12వ అమెరికా సాహితి సదస్సులను సెప్టెంబర్ 25, 26 తేదిల్లో నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా జరగనున్న ఈ వేడుకల్లో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సాహితీ సదస్సు నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, భువన చంద్ర, సుద్దాల అశోక్ తేజ, బలభద్రపాత్రుని రమణి తదితరులు హాజరుకానున్నారు. ఈ సదస్సు నిర్వాహణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి (కెనడా)లతో పాటు మొత్తం ఎనిమిది సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సదస్సులో, సుమారు 100 మంది వక్తలూ పాల్గొంటున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యంకి ఈ సదస్సుని అంకితమిచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu