Ad Code

చైనాకు అమెజాన్‌ భారీ షాక్


అమెజాన్‌ సంస్థ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 600 బ్రాండ్స్‌ను పర్మినెంట్‌గా బ్యాన్ చేసింది. ఇకపై ఆయా ఉత్పత్తులు అమెజాన్‌ సైట్‌లో అందుబాటులో ఉండవు. మొత్తం 600 బ్రాండ్స్‌లో, కొన్ని చైనాలోని పాపులర్ కంపెనీలు కూడా ఉన్నాయి.  చైనీస్ సంస్థలు ప్రత్యేక గిఫ్ట్ కార్డ్స్ ఎరగా చూపుతూ వినియోగదారుల చేత పాజిటివ్ రివ్యూస్ రాయించుకుంటునట్లు  అమెజాన్‌ దృష్టికి రావటతో, అది అమెజాన్‌ నిబంధనలకు విరుద్ధం  కావటంతో అమాంతం వేటు పడింది. అయితే, ఇది చైనాకు వ్యతిరేకంగా తాము తీసుకున్న చర్య కాదని అమెజాన్‌ చెబుతోంది. ముందు ముందు ఏ దేశం బ్రాండ్స్‌కైనా రూల్స్ పాటించకపోతే ఇదే జరుగుతుందని  హెచ్చరిస్తోంది. అమెజాన్‌లో నిషేధం కారణంగా చైనీస్ కంపెనీలు ఇప్పుడు ఈబే, అలీఎక్స్‌ప్రెస్ లాంటి ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu