Ad Code

టెలిగ్రామ్ ఫీచర్లు మీకు తెలుసా?




టెలిగ్రామ్‌.. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఇండియాలో వచ్చిన మెసేజింగ్ సర్వీస్ ఇది. ఈ మధ్య మన దేశంలో టెలిగ్రామ్ యాప్ వాడుతున్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదం తర్వాత చాలా మంది ఈ టెలిగ్రామ్ వైపే చూశారు. వాట్సాప్‌లో ప్రపంచంలోనే టాప్ మెసేజింగ్ సర్వీస్ అయినా.. అందులో లేని కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఈ టెలిగ్రామ్‌లో ఉన్నాయి. నిజానికి ప్రతి నెలా ఓ కొత్త ఫీచర్‌ను ఆ సంస్థ ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చాట్ ఫోల్డర్స్‌

టెలిగ్రామ్ అనేది వ్యక్తుల మధ్య మెసేజ్‌ల కోసమే కాదు.. దీనినో ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగిస్తున్నారు. వ్యక్తుల మధ్య చర్చల కోసం, వన్ వే బ్రాడ్‌కాస్టింగ్ కమ్యూనికేషన్‌గా కూడా టెలిగ్రామ్ ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో మీకు మెయిన్ లిస్ట్‌లో చాలా ఎక్కువ చానెల్స్ ఉంటే.. వాటిని ఫోల్డర్ల రూపంలో వేరు చేసుకోవచ్చు. ఆఫీస్‌, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌.. ఇలా దేనికదే చాట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు.

వీడియో స్క్రీన్ షేరింగ్‌

వీడియో కాల్ మాట్లాడే సమయంలో మీ స్క్రీన్‌ను షేర్ చేసే అవకాశం ఈ ఫీచర్ కల్పిస్తుంది. అయితే ఇది కేవలం గ్రూప్ వీడియో కాల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీడియో కాల్ చేసిన తర్వాత వీడియో చాట్ అనే ఆప్షన్‌లో ఈ ఫీచర్ ఉంటుంది.

క్లౌడ్ స్టోరేజ్‌

టెలిగ్రామ్ అందించే మరో అద్భుతమైన ఫీచర్ ఇది. ఇదొక క్లౌడ్ ఆధారిత మెసెంజర్‌. అంటే యూజర్ల డేటా అంతా వాళ్ల సర్వర్లలో ఉంటుంది. థర్డ్ పార్టీ బ్యాకప్స్ అవసరం లేకుండా యూజర్లు తమ డివైస్‌లలో దేని నుంచైనా వాళ్ల డేటాను యాక్సెస్ చేయొచ్చు. ఇది కూడా అన్‌లిమిటెడ్‌. దీని కారణంగా యూజర్లు తమ డివైస్‌లో ఏ మీడియానూ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

షెడ్యూల్ మెసేజ్‌

ఇది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడే ఫీచర్‌. యూజర్లు తమ మెసేజ్‌లను దీని ద్వారా షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. పలానా సమయాని మీ కాంటాక్ట్స్‌లోని ఒకరికి ఓ మెసేజ్‌ను పంపించడానికి ఈ షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ ఉపయోగించవచ్చు.

లైవ్ ఆడియో ఫీచర్‌

ఫేస్‌బుక్ తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అవుతున్న సోషల్ మీడియా యాప్ క్లబ్‌హౌజ్ తెలుసు కదా. ఇదొక వాయిస్ ఆధారిత యాప్‌. ఇలాంటి ఫీచర్ కూడా టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఉపయోగించి యూజర్లు ఏదైనా గ్రూప్ లేదా చానెల్‌లో చర్చలు జరుపుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu