Ad Code

స్మార్ట్ కళ్లజోడు

 

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ స్మార్ట్ గ్లాసెస్‌ని లాంచ్ చేసింది. రే-బాన్ బ్రాండ్ సాయంతో ఈ సరికొత్త కళ్లద్దాలను అందించనుంది. ఫేస్‌బుక్‌, రే-బాన్ సంయుక్తంగా అందిస్తున్న ఈ కళ్లద్దాలలో ఫోటోలు తీసుకొనేందుకు 5ఎంపీ కెమెరా ఉంది. అంతే కాకుండా 30 సెకన్ల వీడియోల్ని రికార్డు చేసే సామర్థ్యం  ఈ గ్లాసెస్ సొంతం. క్యాప‍్చరింగ్‌ బటన్‌తో పాటు ఫేస్‌బుక్‌ అసిస్టెంట్‌ వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా టచ్‌ చేయకుండానే ఫొటోలు, వీడియోలు తీయొచ్చు, కాల్స్‌ మాట్లాడొచ్చు. అయితే ఇన్‌బిల్ట్‌గా వచ్చే ఎల్‌ఈడీ లైట్‌ సెటప్‌.. క్యాప్చర్‌ కొట్టగానే ఫ్లాష్‌ ఇస్తుంది. కాబట్టి ఈ కళ్లద్దాల వారు ఫోటోలు తీస్తే వెంటనే తెలిసి పోంతుంది. వాయిస్‌ కమాండ్‌ను, ఆడియోను రికార్డు చేసేలా మూడు చిన్న మైక్రోఫోన్‌లు ఉంటాయి.

ఫోన్‌లోని వీడియోలను సైతం వీక్షించేలా కనెక్ట్‌చేసుకోవచ్చు. అలాగే వీటి ద్వారా తీసే వీడియోలను(షార్ట్‌) స్మార్ట్‌ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. అయితే, పేరుకే స్మార్ట్‌ కళ్లజోడు అయినప్పటికీ.. అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ వ్యవస్థ సపోర్ట్‌ లేకపోవడం లోటుగా భావిస్తున్నారు. ఫేస్‌బుక్ 20 రకాల కళ్లజోడులు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్‌బుక్‌. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనెడా, ఐర్లాండ్‌, ఇటలీ, యూకేలో వీటి అమ్మకం మొదలైంది. ఆన్‌లైన్‌తో ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌లలో ఫేస్‌బుక్‌ స్మార్ట్‌ కళ్లద్దాలను అమ్ముతున్నారు. అగుమెంటెడ్‌ రియాలిటీ(AR) ఫీచర్ లేదు.. ఫేస్‌బుక్‌.. తాజా ప్రొడక్ట్‌ రే బాన్‌ స్టోరీస్‌ విషయంలో ఏఆర్‌ని వాడలేదు. రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ అనేది భవిష్యత్‌లో అతిపెద్ద మార్పుకు సంకేతమని, మనం ఎక్కువ కాలం ఫోన్ లు వాడలేమని అంతకు మించి సాంకేతికత అవసరం అని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్ ఓ వీడియోలో అన్నారు. క 2020లో 86 బిలియన్‌ డాలర్ల ఆదాయం వెనకేసుకున్న ఫేస్‌బుక్‌ అందులో చాలా వాటాను అడ్వర్‌టైజింగ్‌ ద్వారానే సంపాదించుకుంది. అయితే అందులో చాలా ఆదాయాన్ని తిరిగి వర్చువల్‌ అండ్‌ అగుమెంటెడ్‌ రియాలిటీ(AR), హార్డ్‌వేర్‌ డెవలపింగ్‌(ఓక్యూలస్‌ వీఆర్‌ హెడ్‌సెట్స్‌, రిస్ట్‌బ్యాండ్‌లు), ఇప్పుడు కళ్లజోడు తయారీకి ఖర్చు చేస్తోంది. ఇక మెటావర్స్‌(వర్చువల్‌ ఎన్విరాన్‌మెంట్‌) ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ఈ మధ్యే కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కమర్షియల్ మార్కెట్‌లో స్మార్ట్ గ్లాసెస్ ఇంకా గుర్తించబడనప్పటికీ, అవి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో భాగమని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి స్మార్ట్ గ్లాసుల వార్షిక అమ్మకాలు 22 మిలియన్ యూనిట్లకు పైగా చేరుకుంటాయని ImmersivEdge సలహాదారులు Cnet నివేదికలో ఉదహరించారు.

Post a Comment

0 Comments

Close Menu