Ad Code

టెక్నో నుంచి తక్కువ ధరకే స్మార్ట్​ఫోన్



హాంగ్​కాంగ్​కు చెందిన ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ టెక్నో వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ భారత్​లో మార్కెట్​ పెంచుకుంటోంది. ఈ సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. టెక్నో స్పార్క్​ 8 పేరుతో సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్​ను లాంచ్​ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన టెక్నో స్పార్క్ 7 సిరీస్​కు కొనసాగింపుగా ఇది విడుదలైంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే కొత్త స్పార్క్ 8 మునుపటి టెక్నో స్పార్క్​ 7 మాదిరిగానే ఉంటుంది. భారత మార్కెట్​లో ఇది రూ.7,999 ధర వద్ద లభిస్తుంది. అట్లాంటిక్ బ్లూ, టర్కోయిస్ సయాన్, ఐరిస్ పర్పుల్ అనే మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. టెక్నో స్పార్క్ 8 స్మార్ట్‌ఫోన్‌ 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ A25 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్​, 64 జీబీ ఆన్​బోర్డ్ స్టోరేజ్‌ని అందించారు. మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ సహాయంతో స్టోరేజ్​ను 256 జీబీ వరకు పొడిగించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత HiOS 7.6 పై నడుస్తుంది. ఈ డివైజ్‌లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్​ను టెక్నో అందించింది. కెమెరా మాడ్యూల్‌లో బయోమెట్రిక్ సెక్యూరిటీ, క్వాడ్ ఫ్లాష్ కోసం ఫింగర్​ప్రింట్​ స్కానర్లను కూడా చేర్చింది. దీని వెనుకవైపు 16 మెగాపిక్సెల్ ప్రైమరీ, సెకండరీ కెమెరా సెన్సార్​ కెమెరాను అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను చేర్చింది. టెక్నో స్పార్క్ 8 లోని కెమెరా యాప్​లో 1080p టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ, స్మైల్ క్యాప్చర్, పనోరమ, పోర్ట్రెయిట్ మోడ్, స్లో మోషన్ మోడ్​లను అందించింది. టెక్నో స్పార్క్ 8లో డ్యుయల్ 4G వోల్ట్​, వైఫై, బ్లూటూత్, జీపీఎస్​, 3.5 ఎంఎం జాక్ వంటి కనెక్టింగ్​ ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్​లో 10W ఛార్జింగ్‌ సపోర్ట్​తో కూడిన 5,000mAh బ్యాటరీ యూనిట్‌ను చేర్చింది. ఈ ఫోన్ సుమారు 29 రోజుల స్టాండ్‌బై టైం, 31 గంటల టాక్ టైమ్, 13.27 గంటల గేమ్​ టైమింగ్​ అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu