Ad Code

తొక్కే కదా అని పారేయకండి..!

 


మనం అరటిపండుని తిని తొక్క పడేస్తుంటాం. కానీ ఆరోగ్యానికి అరటిపండు మంచిదైతే, చర్మ ఆరోగ్యానికి ఆ అరటిపండు తొక్క ఇంకా మంచిదట. అరటిపండు తొక్కతో ఎన్నో చర్మసమస్యలకు పరిష్కారంలభిస్తుంది. అరటితొక్కలో సిలికా ఎంటెంట్‌ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఫినోలిక్స్, యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు కలిగి ఉంటుంది. అరటి తొక్కలోని తెల్లటి భాగాన్ని మీ ముఖం మీద మొటిమలు, మచ్చలపై సున్నితంగా రుద్దాలి. దాన్ని 15 నిమిషాలపాటు అలాగే ఉంచి  ఆపై ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. ఫైబర్‌ అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే అరటి తొక్క చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. ఇది మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది. అరటి తొక్కలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాల్లో తేలింది. సోరియాసిస్‌తో బాధపడుతున్నవారికి కూడా ఈ అరటి తొక్కతో దురద నుంచి ఉపశమనం కలగుతుందట. తొక్కను తిన్నా కూడా మంచిదేనట. అరటి పండు తొక్కను తినడం వల్ల ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుందట. ఈ తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి ఇది దృష్టి సమస్యలను పోగొటట్టంలో ఉపయోగపడుతుంది. రేచీకటి, శుక్లాలు రావు. దెబ్బలు, గాయాలు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది. అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా,తెల్లగా మారుతాయట. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చట!.

Post a Comment

0 Comments

Close Menu