Ad Code

పెరగనున్న వంట గ్యాస్‌ ధర ?

  

దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా, అవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ.100 మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకోనున్నాయని.. ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ మేరకు పెంపు ఉంటుందని సమాచారం. ఈనెల 6న వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ.15 చొప్పున చమురు సంస్థలు పెంచాయి. జులై నుంచి అక్టోబరు 6 వరకు దీని ధర రూ.90 పెరిగింది. ఎల్పీజీపై గతేడాది నుంచే కేంద్రం రాయితీలు తొలగించింది. అయితే పెట్రోల్, డీజిల్ మాదిరి ఎల్పీజీ ధరపై నియంత్రణ ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న వంటగ్యాస్ ధరల మధ్య అంతరాన్ని భరించేందుకు కూడా కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేకుంటే వినియోదారులపై మోపేందుకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 85 డాలర్లపైనే ట్రేడవుతోంది. కాగా ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో పెట్రోవాత కొనసాగే అవకాశముంది. 

Post a Comment

0 Comments

Close Menu