Ad Code

వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి డెల్టా వ్యాప్తి !

 

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా విజయ వంతంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్‌ డోసులను కూడా ఇచ్చేశాయి. అయినప్పటికీ యూకే, రష్యా లాంటి దేశాల్లో కరోనా విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి విపరితంగా ఉంది. మరీ… వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ఉదృతికి కారణమేంటి ? అంటే వ్యాక్సిన్‌ వేసుకున్న వారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే అని ఓ అధ్యయనం లో తేలింది. కరోనా రకాల్లోనే అత్యంత ప్రమాదకరమైన వేగవంతమైన వేరియంట్‌ గా పిలుస్తున్న డెల్టా రకం వైరస్‌.. టీకా వేసుకున్న వ్యక్తి నుంచి కూడా సులువుగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. బ్రిటన్‌ కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ 621 మందితో ఏడాది పాటు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం పడింది. 651 మందిపై ఈ అధ్యయనం జరపగా ఇందులో 205 మంది నుంచి వారి కుటుంబ సభ్యులకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు తేలింది.

Post a Comment

0 Comments

Close Menu