Ad Code

బాదముతో ఆరోగ్య బహుమతి !


దీపకాంతుల పండుగ అత్యంత వేగంగా రాబోతుంది. ఉత్సాహమూ తారాస్థాయికి చేరుతుంది. ఉత్సాహం, సంతోషంతో దీపావళి పండుగను వేడుక చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. మట్టి ప్రమిదలు, రంగ వల్లులు, మెరిసే అద్భుత దీపాలు, రుచికరమైన ఆహారం, కుటుంబ సమావేశాలతో ఆకర్షణీయంగా ఉండే దీపావళి వేడుక కోసం ఎంతో మంది భారతీయులు అత్యంత ఆసక్తికరంగా చూస్తుంటారు. దీపావళి పండుగ వేళ అత్యంత ఆసక్తిగా కనిపించే పురాతన సంప్రదాయం బహుమతులు మార్చుకోవడం ఒకటి. మీ ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడపడాన్ని మించిన తియ్యందనం ఏదీ లేదన్నది నిజమే అయినా, ఆలోచనాత్మకంగా మరియు అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న బహుమతులు ఈ పండుగ వేడుకలకు మరింత విలువను, అర్థం అందిస్తాయి. చక్కటి ఆరోగ్యపు బహుమతిగా బాదములు ప్రసిద్ధి. వీటిలో విటమిన్‌ ఈ, డైటరీ ఫైబర్‌, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌ మొదలైన 15 అత్యవసర పోషకాలు ఉంటాయి. సంవత్సరాల తరబడి చేసిన శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించిన దాని ప్రకారం, బాదములు తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం, మధుమేహం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణ పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ 'భారతదేశంలో నెమ్మదిగా అయినా స్థిరంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. మా కుటుంబ సభ్యులతో పాటుగా ప్రియమైన వారితో కలిసి సురక్షితంగా దీపావళి వేడుక చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పండుగలలో అతి ముఖ్యమైన భాగం బహుమతులను పంచుకోవడం మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే బహుమతులను పంచడాన్ని నేను ఓ అలవాటుగా మార్చుకున్నాను. నా వరకూ అత్యున్నతమైన ఎంపికగా బాదములు నిలుస్తుంటాయి. ఇవి వైవిధ్యమైనవి, పోషకాలతో కూడినవి. వీటిని అతి సులభంగా పలు భారతీయ రెసిపీలలో జోడించవచ్చు. ఆకలి వేసినప్పుడు స్నాక్‌గా వీటిని తినవచ్చు లేదా పండుగ స్ఫూర్తిని పంచుతూ అతిథులకు వీటిని పంచవచ్చు. వీటితో పాటుగా బాదములలో రోగ నిరోధక వ్యవస్థకు మద్దతునందించే పోషకాలు అయినటువంటి జింక్‌, ఫోలేట్‌, విటమిన్‌ ఈ , ఐరన్‌ వంటివి ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరికీ అద్భుతమైన బహుమతిగా నిలుస్తాయి' అని అన్నారు. సుప్రసిద్ధ ఫిట్‌నెస్‌ మరియు సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌, యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ 'ప్రియమైన వారిని కలుసుకునేందుకు, నూతన జ్ఞాపకాలను నిలుపుకునేందుకు అత్యద్భుతమైన సందర్భం దీపావళి. నవరాత్రి, దసరా, దుర్గా పూజ మరియు ఇప్పుడు దీపావళి కారణంగా దాదాపుగా నెలరోజులుగా వేడుకలు జరుగుతున్నాయి . ఈ కారణం చేత చాలామంది తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపడం లేదు. శారీరక వ్యాయామాల క్రమాన్నీ అనుసరించడం లేదు. ప్రతి రోజూ ఖచ్చితంగా 30నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామాలను చేయడాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఆఖరకు పండుగ వేడుకలకు సిద్ధమవుతున్నా, అది తప్పనిసరి. ఈ వ్యాయామాలలో భాగంగా నడక , ఇంటిలో వర్కవుట్స్‌చేయడం లేదా వర్కవుట్‌ కోసం జిమ్‌కు వెళ్లడం ఏదైనా చేయవచ్చు. వీటితో పాటుగా పౌష్టికాహార బహుమతులు అయినటువంటి బాదములను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ప్రోటీన్‌ అధికంగా బాదములలో లభ్యమవుతుంది. ఫైబర్‌ కూడా దీనిలో అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన, ఆకలి తీర్చే స్నాక్‌. ఇది భోజనాల నడుమ ఆకలి తీర్చుకోవడానికి అనుకూలంగా ఉండటంతో పాటుగా అధికంగా చిరుతిళ్లపై ఆధారపడటమూ తగ్గిస్తుంది' అని అన్నారు. షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ 'సంప్రదాయపరంగా, పండుగల వేళ, ప్రత్యేక సందర్భాలలో బాదములను శుభప్రదమైన బహుమతిగా భావిస్తుంటారు. బాదములను బహుమతిగా అందించడం అంటే చక్కటి ఆరోగ్యం బహుమతిగా అందించడం. బహుమతులు అందించిన వారు తీసుకునే శ్రద్ధ, ఎదుటి వారి పై ప్రేమను ఇది తెలియజేస్తుంది. బాదములు లాంటి బహుమతులు, కేవలం పోషకాలతో నిండి ఉండటమే కాదు, అత్యంత రుచికరమైన స్నాక్‌గా కూడా నిలుస్తాయి. బహుమతి అందుకున్న వారి పట్ల మీ ఆసక్తి, వారి కుటుంబ ఆరోగ్యం పట్ల మీ అభిమానంకు ఇది ప్రాతినిథ్యం వహిస్తుంది' అని అన్నారు. అందువల్ల, అత్యుత్తమ సంప్రదాయాలను చక్కటి ఆరోగ్యంతో మిళితం చేయండి. 

Post a Comment

0 Comments

Close Menu