Ad Code

అత్యంత పవర్‌ఫుల్‌ పల్సర్‌ ?

 

కొత్త డిజైన్‌తో రానున్న బజాజ్‌ పల్సర్‌ 250తో పాటు మరో కొత్త బైక్ పల్సర్‌ 250ఎఫ్‌ ఈ నెల 28న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఇటీవల ఈ బైక్‌లకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు వచ్చిన పల్సర్‌ బైక్‌లలో ఇవే అత్యంత శక్తిమంతమైనవిగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొత్త పల్సర్‌ 250.. 27 హెచ్‌ఫీ శక్తిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అంటే ప్రస్తుతం పల్సర్‌ మోడల్‌లో అత్యంత పవర్‌ఫుల్‌గా పేర్కొంటున్న 220ఎఫ్‌, ఆర్‌ఎస్‌200, పల్సర్ ఎన్‌ఎస్‌200 కంటే కూడా ఇది ఎక్కువ శక్తిని విడుదల చేయనుంది. ఇంజిన్‌ను సైతం కొత్తగా డిజైన్‌ చేసినట్లు ఆన్‌లైన్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కొత్త పల్సర్‌ 250 లుక్ విషయానికి వస్తే స్పోర్టీ స్టైలింగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా ఎన్‌ఎస్‌200ని పోలి ఉన్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. అయితే, దాని కంటే కొంచెం పెద్దగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముందు భాగం 220ఎఫ్‌ని తలపిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, మొత్తంగా బైక్‌ లుక్ మాత్రం ఇప్పుడు ఉన్న పల్సర్‌ బైక్‌లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కొత్త పల్సర్‌ 250లో పలు ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌లైట్‌తో పాటు కొత్తగా వస్తున్న రెండు బైక్‌లలో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, వెనుకభాగంలో మోనోషాక్‌ అబ్జర్బర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ కూడా ఉండనున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu