Ad Code

ట్రూకాలర్ తో రైల్వేస్ ఒప్పందం

 


లక్షలాది మంది భారతీయులు ప్రతి రోజూ వినియోగించుకునే ఇంటిగ్రేటెడ్‌ నేషనల్‌ రైల్వేస్‌ హెల్ప్‌లైన్‌ 139 ను ఇప్పుడు ట్రూకాలర్‌ బిజినెస్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌ ధృవీకరిస్తుంది. ప్రజలు ఇప్పుడు గ్రీన్‌ వెరిఫైడ్‌ బిజినెస్‌ బ్యాడ్జ్‌ లోగోను 139 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసినప్పుడవచ్చు. దీనితో పాటుగా ఎస్‌ఎంఎస్‌ సందేశాల హెడర్లు, వినియోగదారులు తమ బుకింగ్స్‌, పర్యటన వివరాలను ఐఆర్‌సీటీసీ నుంచి మాత్రమే అందుకున్నామనే భరోసా అందిస్తాయి. తద్వారా వెరిఫైడ్‌ టిక్‌ మార్క్‌ ఐకాన్‌, ఇండియన్‌ రైల్వేస్‌ బ్రాండ్‌ పేరు, ప్రొఫైల్‌ ఫోటోను ట్రూకలర్‌లో చూడవచ్చు. ఇది వినియోగదారులకు సురక్షిత పాటుగా మోసాలు జరిగేందుకు ఉన్న అవకాశాలను తగ్గిస్తుంది.

ట్రూకాలర్‌తో భాగస్వామ్యం గురించి రజ్నీ హసిజా, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ - ఐఆర్‌సీటీసీ మాట్లాడుతూ '' ట్రూకాలర్‌తో కలిసి పనిచేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో, ఐఆర్‌సీటీసీ యొక్క కమ్యూనికేషన్‌ మాధ్యమాలను వినియోగదారులకు మరింత సురక్షితమైన రీతిలో ట్రూ కాలర్‌ భాగస్వామ్యంతో మార్చడంలో మరో అడుగు ముందుకు వేయడంతో పాటుగా మా వినియోగారుల నడుమ నమ్మకాన్ని వృద్ధి చేయనున్నాం'' అని అన్నారు. విస్తృత శ్రేణి ఉత్పత్తులు, సేవల పరంగా ఐఆర్‌సీటీసీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ 139ను నిర్వహిస్తుంది. దీనిని ప్రతి రోజూ లక్షలాది మంది ప్రజలు తమ రోజువారీ ప్రయాణీకుల రైళ్ల సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ 139 ఎంక్వైరీ, హెల్ప్‌లైన్‌ సేవలను 2007లో భారత్‌ బీపీఓ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను ఈ ప్రాజెక్ట్‌లో సాంకేతిక భాగస్వామిగా ప్రారంభించింది. ఈ హెల్ప్‌లైన్‌ ప్రతి రోజూ దాదాపు 2 లక్షల కాల్స్‌ను రైళ్ల సంబంధిత రిజర్వేషన్‌, ఆగమనం మరియు డిపార్చర్‌ తో పాటుగా భద్రత, వైద్య, ఇతర ప్రత్యేక అవసరాల కోసం అభ్యర్ధిస్తూ చేస్తున్నారు.

''ట్రూ కాలర్‌ ఫర్‌ బిజినెస్‌ సేవలను ఇప్పటికే వందలాది సంస్థలు వినియోగించుకుంటున్నాయి. మా పరిష్కారాలను అంతర్జాతీయంగా వినియోగించుకోవడం ద్వారా ఆధీకృత సంభాషణలు చేస్తున్నాము. ఐఆర్‌సీటీసీతో ఈ కార్యక్రమం కోసం కలిసి పనిచేయడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎన్నో పరిష్కారాలలో ఇది మొదటిది. కమ్యూనికేషన్‌ పరంగా నమ్మకం కలిగించేందుకు మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాము మరియు భారత దేశ డిజిటల్‌ ప్రయాణంలో మద్దతునందించేందుకు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాము'' అని ట్రూ కాలర్‌ ఇండియా ఎండీ రిషిత్‌ ఝుంఝుంవాలా అన్నారు. 2014 నుంచి, ప్రజల అనుభవాలను మెరుగుపరచడంలో గణనీయంగా ఐఆర్‌సీటీసీ వృద్ధి చెందింది. మరీ ముఖ్యంగా టిక్కెట్ల బుకింగ్‌ మరియు సౌకర్యవంతమైన ప్రయాణాల పరంగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నూతన డిజిటల్‌ ఇండియా కింద, మరింత మంది ప్రజలు ఇప్పుడు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప రిజర్వేషన్‌ కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అందువల్ల ఐఆర్‌సీటీసీ ఇప్పుడు వారికి మరింత మెరుగైన సేవలను అందించడానికి తమ ప్రయత్నాలను మెరుగుపరుచుకుంటూ డెడికేటెడ్‌ యాప్స్‌, సురక్షిత ఈ-బుకింగ్‌ వెబ్‌సైట్‌ అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu