Ad Code

ఎలక్ట్రిక్‌ కార్లపై ఉబర్‌ చూపు...!

 

ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సన్నద్దమైన విషయం తెలిసిందే. సాంప్రదాయ శిలాజ ఇంధన వాహనాలకు చెక్‌ పెడుతూ, ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారించాయి. కాగా హెర్జ్‌ వంటి రెంటర్‌ కార్‌ ఆపరేటర్స్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడేందుకు సిద్దమయ్యాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పేరొందిన టెస్లాతో అమెరికన్‌ రెంటల్‌ కార్‌ కంపెనీ హెర్జ్‌ కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. హెర్జ్‌ సుమారు లక్ష టెస్లా కార్లను ఆర్డర్‌ను చేసింది. తాజాగా మరో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ క్యాబ్‌ ఆపరేటర్‌ ఉబర్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించింది. అందులో భాగంగా హెర్జ్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఉబర్‌ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెర్జ్‌ రెంటల్‌ ఎలక్ట్రిక్‌ కార్లను ఉబర్‌ వాడనుంది. సుమారు 50 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉబర్‌ ఆర్డర్‌ ఇచ్చింది. 2023 నాటికి 50 వేలకు ఎలక్ట్రిక్‌ కార్ల క్యాబ్‌ సర్వీస్‌లను ప్రవేశపెడతామని ఉబర్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా, యూరప్‌, కెనడాలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఎలక్ట్రిక్‌ క్యాబ్‌ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఉబర్‌ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu