Ad Code

ఎన్నికలకు షెడ్యూల్ విడుదల


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడులయింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇక తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది ఈసీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండడంతో.. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి, తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో.. మెజారిటీ స్థానాలను ఆయా పార్టీలే గెలుచుకునే అవకాశముంది.

Post a Comment

0 Comments

Close Menu