Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, October 26, 2021

ఇటలీలో ఎయిర్‌హోస్టెస్‌ల అర్థనగ్న నిరసన

 


ఇటలీలో సుమారు 50 మంది ఎయిర్‌హోస్టెస్‌లు రోడ్డు మీదకు వచ్చి దుస్తులు విప్పి అర్థనగ్న నిరసన తెలిపారు. తమ ఉద్యోగాల సమస్యను పరిష్కరించాలంటూ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఈ నిరసన కాంపిడోగ్లియోలో జరిగింది. నిరసనపై మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించగా.. శాలరీలో కోతలు, ఉద్యోగాల నష్టంతో తాము తీవ్ర మనస్థాపం చెందామని, అందుకే నిరసన చెప్పటినట్లు ఎయిర్‌హోస్టెస్‌లు తెలిపారు. ఐటీఎ ఎయిర్‌ వేస్‌ తమ శ్రమ, అంకితభావంతో విజయ శిఖరాలకు చేరుతుంటే.. కంపెనీ మాత్రం తమకు అన్యాయం చేస్తోందని ఎయిర్‌హెస్టెస్‌లు ఆరోపించారు. ఎయిర్‌ వేస్‌ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ నిరసనకు దిగారు. కాంపిడోగ్లియోలోని ఓ జంక్షన్‌ వద్ద నిలబడి దుస్తులను తీసివేసి.. అండర్‌ గార్మెంట్స్‌తో నిరసన ప్రదర్శన చేశారు. ఇటీవల అలిటాలియా ఎయిర్‌లైన్స్‌ను ఐటీఏ ఎయిర్‌వేస్‌ స్వాధీనం చేసుకుంది. దీంతో అప్పటి వరకు ప్రశాంతం ఉన్న వారి ఉద్యోగాల్లో ఇంత హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. అలిటాలియా ఎయిర్‌లైన్స్‌ చేతులు మారడంతో.. అది అందులో పని చేస్తున్న ఉద్యోగుల తీవ్ర ప్రభావాన్ని చూపింది. అలిటాలియా ఎయిర్‌లైన్స్‌లో 10,500 మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ ఐటీఏ ఎయిర్‌వేస్‌ మాత్రం కేవలం 2,600 మంది ఉద్యోగులను మాత్రమే రిక్రూట్‌ చేసుకుంది. దీనిపై ఐటీఏ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. తమకు రావాల్సిన ఉద్యోగాలు దక్కకపోగా, జీతాలు కూడా బాగా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనపై ఐటీఏ ఎయిర్‌వేస్‌ ప్రెసిడెంట్‌ ఆల్ఫ్రెడో అల్టావిల్లా స్పందించారు. కంపెనీ నిబంధనలను అనురించి ఒప్పందంపై అందరూ ఉద్యోగాలు సంతకాలు చేశారని.. అయితే ఉద్యోగులు సమ్మె చేస్తారని తాను భావించలేదన్నారు. అలా చేయడం వల్ల, వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. అలిటాలియా ఎయిర్‌లైన్స్‌ కింద 110 విమానాలు నడపబడ్డాయి. ఇందులో 10 వేల మంది ఉద్యోగులు పని చేసేవారు. కానీ ఇప్పుడు ఐటీఏ ఎయిర్‌వేస్‌ కింద 52 విమానాలు మాత్రమే పని చేస్తున్నాయి. దీని కోసం 2,600 మంది ఉద్యోగులను మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మంది ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు తెలుస్తోంది.


No comments:

Post a Comment

Popular Posts