హైదరాబాద్ ఘట్‌కేసర్‌కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి సైబర్ నేరగాళ్లు సృష్టించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. దీంతో యాబై వేల రూపాయలు ముందుగా జమ చేశాడు. దీంతో జమ చేసిన మరునాడే క్రిప్టో కరెన్సి విలువ పెరిగిందని మరునాడే పదివేల రూపాయలు లాభం వచ్చిందంటూ..నమ్మించారు. దీంతో కిరణ్ కుమార్ లక్షల రూపాయలను జమ చేయడం ప్రారంభించాడు. ఇలా ఏకంగా మొత్తం 88 లక్షల రూపాయలను ఆయన జమ చేశారు.. అంత పెద్ద స్థాయిలో డబ్బులు జమ అయిన తర్వాత అసలు యాప్ పని చేయడం క్లోజ్ అయింది. దీంతో కిరణ్ కుమార్‌కు అసలు విషయం అర్థమయింది. తాను మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా వారిలో ఓ బ్యాంకు ఉద్యోగి తనకు తెలిసిన సమీప గ్రామాల్లోని అడ్రస్‌లు తీసుకుని వందల సంఖ్యలో ఖాతాలు సృష్టించాడు. వీటితో ఫేక్ కంపనీలను సైతం సృష్టించాడు దందాలు కొనసాగిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందుతులను అరెస్ట్ చేసి వారి ఖాతాలో ఉన్న యాబై లక్షల రూపాయలను సైతం సీజ్ చేశారు.
No comments:
Post a Comment