Ad Code

రికార్డు స్థాయిలో రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు

  


షావోమీ సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మీ మొబైల్ మార్కెట్‌లో సంచలన రికార్డులను నెలకొల్పుతోంది. యాపిల్ ఫోన్ల తర్వాత ఆ రేంజ్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయే ఫోన్లుగా రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లు రికార్డులు తిరగ రాస్తున్నాయి. షావోమీ సంస్థ రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ను కొద్ది రోజుల క్రితం భారీ అంచనాల నడుమ చైనాలో లాంచ్ చేసింది. ఇందులో రెడ్‌మీ నోట్ 11, నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ అనే మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అయితే చైనాలో సోమవారం రోజు సేల్ ప్రారంభమైన తర్వాత ఒక గంట వ్యవధిలోనే 5 లక్షల కంటే ఎక్కువగా రెడ్‌మీ నోట్ 11 సిరీస్ ఫోన్లు అమ్ముడుపోయినట్లు షావోమీ పేర్కొంది. ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభమైన మొదటి 52 నిమిషాల 11 సెకన్లలో ఫోన్ల విక్రయాల ద్వారా దాదాపు 4 బిలియన్ యువాన్‌లను సంపాదించినట్లు షావోమీ తెలిపింది. వీటిలో 1 నిమిషం 45 సెకన్లలో 2 బిలియన్ యువాన్లు సంపాదించడం గమనార్హం. చైనాలో నవంబర్ 1న సేల్ ప్రారంభమైన తర్వాత గిజ్‌మొ చైనా(GizmoChina) కొత్త నివేదికలో అమ్మకాల సంఖ్య గురించి తెలిపింది. ఈ సంఖ్య షావోమీ ఫోన్‌లకు స్వదేశంలో ఉన్న డిమాండ్‌ను సూచిస్తున్నాయి. ఈ స్థాయిలో మొబైల్ ఫోన్లు అమ్ముడుపోతాయని చాలామంది టెక్ నిపుణులు ముందుగానే ఊహించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో విడుదలైన రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌కు కూడా ఇదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అమ్మకానికి వచ్చిన మూడు నెలల్లోనే, షావోమీ భారతదేశంలో 20 లక్షలకు పైగా రెడ్‌మీ నోట్ 10 ఫోన్‌లను విక్రయించగలిగింది. తదుపరి సిరీస్‌లు లాంచ్ అయ్యాక ఏ మార్కెట్‌లోనైనా ఇదే విధమైన విక్రయాలను నమోదు చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షావోమీ ఇప్పటికే తన స్వదేశంలో భారీ ఎత్తున మొబైల్ ఫోన్ లను విక్రయించగలుగుతోంది కానీ భారతదేశానికి ఎప్పుడు ఫోన్‌లను తీసుకువస్తుందనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న చిప్(chip shortage) కొరత అనేది భారతదేశంలో మొబైల్ ఫోన్స్ విడుదల అవుతాయా లేదా అనేది నిర్ణయించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని వనిల్లా మోడల్, రెడ్‌మీ నోట్ 11 ధర 1199 (సుమారు రూ. 14,000) యెన్‌ల వద్ద ప్రారంభమవుతుంది. ఈ మోడల్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో 6జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1599 (దాదాపు రూ.18,700)యెన్‌లగా నిర్ణయించారు. రెడీమి నోట్ 11 ప్రో+ 1899 (సుమారు రూ. 22,200) యెన్‌ల వద్ద ప్రారంభమవుతుంది. రెడ్‌మీ నోట్ 11 ఇబో (Yibo) ఎడిషన్ విక్రయానికి ఉంది. ప్రత్యేకమైన గ్రీన్-ఫినిష్, 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2699(దాదాపు రూ.31,500) యెన్‌లగా నిర్ణయించారు

Post a Comment

0 Comments

Close Menu