Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, November 6, 2021

ఒక్క రక్త నమూనాతో 50కి పైగా క్యాన్సర్లను గుర్తించొచ్చు


మనిషి సాంకేతికంగా ఎంత ఎత్తు ఎదిగినా, వైద్య వ్యవస్థలో ఎన్ని రకాల అధునాతన చికిత్సలు వచ్చినా ఇప్పిటికీ పూర్తిగా అంతం కానీ వ్యాధి ఏదైనా ఉందా.? అంటే అది క్యాన్సర్‌ అని చెప్పాలి. శరీరాన్ని కొంచెం కొంచెంగా నాశనం చేస్తూ చివరికి మరణానికి చేరువ చేస్తుందీ మాయదారి రోగం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా కొద్ది రోజుల్లోనే క్యాన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే ఈ మాయదారి రోగాన్ని సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే తొలినాళ్లలోనే అంతం చేయవచ్చు. మరి వ్యాధి లక్షణాలు కనిపించేంత వరకు క్యాన్సర్‌ ఉందన్న విషయం తెలియదు. పోనీ లక్షణాలు బయటపడ్డాయంటే వ్యాధి సంక్రమణ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ కారణంగానే చాలా మంది క్యాన్సర్‌ కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే అమెరికాకు చెందిన ఓ సంస్థ సరికొత్త పరీక్షా విధానాన్ని తీసుకొచ్చింది. ఒకే ఒక రక్త నమూనాతో ఏకంగా 50కి పైగా క్యాన్సర్లను గుర్తించగలిగే పరీక్షను అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన మయో క్లినిక్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ పరీక్షా విధానానికి ‘గల్లేరీ’ అని నామకరణం చేశారు. ఈ పరీక్షతో క్లోమం, అండాశయం వంటి అత్యంత క్లిష్టమైన క్యాన్సర్లను కూడా మొదట్లోనే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పరీక్షల ఫలితాన్ని పరీక్షించేందుకు గాను వైద్యులు ఏకంగా 1,34,000 మందిపై క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించారు. వీటిలో మంచి ఫలితాలు వచ్చాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారికి ఈ పరీక్ష ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇక ఈ పరీక్షకు అయ్యే ఖర్చు విషయానికొస్తే 949 డాలర్లు  అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 70,417 అన్నమాట.

No comments:

Post a Comment

Popular Posts