Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, November 3, 2021

జలుబు,దగ్గు,గొంతు నొప్పి తగ్గడానికి చిట్కాలు!


దగ్గు గొంతులో శ్లేష్మం సమస్య ఉన్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడతాయి. మార్కెట్లోకి రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆహారాలు, పానీయాలు లభ్యం అవుతున్నాయి. జలుబు,దగ్గు వంటి తేలికపాటి లక్షణాలని తగ్గించడానికి రోగనిరోధక శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే డ్రింక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి దానిలో 4 మిరియాలు,4 లవంగాలు,ఒక యాలక్కాయ, అరస్పూన్ వాము, 4 తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఈ డ్రింక్ ని వడకట్టి తాగాలి. ఈ విధంగా ఈ పానీయాన్నిగోరువెచ్చగా ఉన్నప్పుడూ తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. రెండు రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.


No comments:

Post a Comment

Popular Posts