Ad Code

ఖాతాదారులకు ఎస్ బి ఐ హెచ్చరిక !


దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డ్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూజర్ ఐడీ/పాస్వర్డ్, డెబిట్ కార్డ్ పిన్, సీవీవీ, ఓటీపీ తదితర నంబర్లను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దని బ్యాంకు సూచించింది. అలా చేస్తే మోసపోతారని హెచ్చరించింది. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మోసం చేస్తారని హెచ్చరించింది ఎస్బీఐ. ఎవరైనా ఫోన్ చేసి తాము ఎస్బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్, కేవైసీ నుంచి అని చెబితే నమ్మవద్దని తెలిపింది. అలాంటి వారికి బ్యాంకింగ్ కు సంబంధించిన వివరాలు చెప్పవద్దని వెల్లడించింది. మొబైల్ యాప్ లను అపరిచితుల నుంచి ఫోన్ కు వచ్చే మెసేజ్ లలోని లింక్ ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేసుకోవద్దని బ్యాంక్ హెచ్చరించింది. అలా చేస్తే సైబర్ దాడికి గురై.. మోస పోయే ప్రమాదం ఉందని బ్యాంక్ తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఇటీవల బ్యాంక్ ఖాతాదారుల మెయిల్ కు ఫేక్ లింక్ లు పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి లింక్ లపై క్లిక్ చేస్తే సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్ లోని లింక్ లపై క్లిక్ చేయొద్దని బ్యాంకు సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu