Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, November 3, 2021

శ్రీవారిని సందర్శించుకున్నవిశాల్

 

హీరో విశాల్ తన నటించిన 'ఎనిమి' చిత్రం సక్సెస్ కావాలని కోరుతూ శ్రీవారిని సందర్శించేందుకు కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు.విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌లో తెరకెక్కి, నవంబర్ 4వ తేదీన విడుదలకాబోతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఎనిమి'. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ.. విశాల్ బుధవారం నడక దారిన తిరుమలకు చేరుకున్నారు.శ్రీవారి మొక్కు చెల్లింపులో భాగంగా అలిపిరి కాలిబాట మార్గం గుండా నడుచుకుంటూ తిరుమల చేరిన విశాల్.. బుధవారం రాత్రికి తిరుమలలోనే బసచేసి.. గురువారం శ్రీవారిని దర్శించుకోనున్నారు.


No comments:

Post a Comment

Popular Posts