Ad Code

నోరూరించే స్నాక్స్.!

 

ఉరుకుల పరుగుల జీవితంలో యువతకు అధిక బరువు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక్కసారి బరువు పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే మీ డైట్‌లో తగినంత క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పెరిగిన బరువును సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు. 

అప్పడాలు: వీటిని భోజనం తర్వాత వడ్డిస్తారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది గొప్ప ఛాయస్. అప్పడాల్లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీకు ఆకలి వేసినప్పుడు వీటిని తినండి. వీటితో మీ బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. అయితే ఈ అప్పడాలను నూనెతో కాకుండా మాములుగా వేయించండి. ఉడకబెట్టిన కూరగాయలతో కూడా వీటిని తినొచ్చు.

ఇడ్లీ: ఓట్స్, తురిమిన క్యారెట్‌లతో చేసిన ఇడ్లీలు చాలా ఆరోగ్యకరమైనవిగా వైద్యులు పరిగణిస్తారు. ఇది తక్కువ క్యాలరీల ఫుడ్. ఇవి తింటే మీ ఆకలి కూడా తీరుతుంది. బరువు పెరుగుతారన్న చింత కూడా ఉండదు. స్నాక్స్‌గా మాత్రమే కాదు లంచ్ లేదా డిన్నర్‌గా కూడా ఈ ఇడ్లీలను తీసుకోవచ్చు.

దోక్లా: ధోక్లా అనేది తక్కువ క్యాలరీల ఫుడ్. మైక్రోవేవ్‌ ద్వారా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తినండి.

శెనగలు, మరమరాలు: శెనగలు, మరమరాలు తక్కువ క్యాలరీలు కలిగిన స్నాక్. ఇవి మీ కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. మీ శక్తిని కూడా పెంచుతాయి. అలాగే వీటి వల్ల బరువు కూడా పెరగరు. మరో ఆలోచన కూడా లేకుండా.. మీకు ఆకలిగా అనిపిస్తే.. ఈ స్నాక్‌ను తీసుకోండి.

Post a Comment

0 Comments

Close Menu