Ad Code

అధిక వడ్డీ ఆశ - కోట్లల్లో మునక!

 


అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి ప్రముఖుల నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్లను ఆమె మోసం చేసినట్లు గుర్తించారు. బాధితుల్లో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు టాలీవుడ్ హీరోలను శిల్ప మోసం చేసినట్లు సమాచారం. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి పలువురు సెలబ్రిటీలను ఆకర్షించి, రూ.100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కుచ్చు టోపీ పెట్టిందని బాధితులు ఈ కిలేడీపై నార్సింగి పీఎస్‌లో కంప్లయింట్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరితో పాటు ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. ఈమె బాధితుల నుంచి కోట్లాది రూపాయల వసూలు చేసిందని ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా ఈమెకు పలు చీటింగ్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. శిల్పా చౌదరి బాధితుల్లో నటులు మాత్రమే కాదు బ్యూరోక్రాట్‌లతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు.


Post a Comment

0 Comments

Close Menu