Ad Code

డయబెటిస్-రాజ్మా-ఉపయోగాలు

 

చిక్కుడు జాతికి చెందిన రాజ్మా కిడ్నీలను పోలి ఉండటం వలన కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. వీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాజ్మాను ప్రోటీన్ మరియు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. మాంసాహారం తిన లేనివారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రాజ్మా లో రాగి, ఐరన్, పాస్పరస్, మాంగనీస్, విటమిన్ బి 1, పోలెట్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది. వీటిలో విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే ఇసో ప్లేవొన్, .ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా అకస్మాత్తుగా వచ్చే రక్తపోటును మరియు గుండె కండరాల పనితీరు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్త ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది. నరాల బలహీనత, అలసట, నీరసం అనేవి ఉండవు. రాజ్మాలో ఉండే కరిగే ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క సమ్మేళనం బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలు గుళ్ల బారటం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాజ్మాలో ఉండే పోలేట్ శరీరంలో అసమానతలను క్రమబద్ధీకరణ చేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటికి కాస్త దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు రాజ్మా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు విరివిగానే లభ్యమవుతున్నాయి.  రాజ్మా ను మసాలా కర్రీ గా చేసుకోవచ్చు. ఉడికించి తినవచ్చు. అలాగే కూరలు చేసు కున్నప్పుడు వాటిలో వేసుకోవచ్చు. రాజ్మాను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు వండుకోవాలి. లేదా ఉదయం సమయంలో నానబెట్టి సాయంత్రం సమయంలో వండుకోవాలి. రాజ్మాను దాదాపుగా 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టాలి.


Post a Comment

0 Comments

Close Menu