Ad Code

ఫేస్‌బుక్‌కు బిగ్ షాక్...!



ఇటీవలే ఫేస్‌బుక్ పేరును మెటాగా మారుస్తూ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. పేరు మారి వారం అయిందో లేదో.. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాకు బిగ్ షాక్ తగిలింది. మెటా మీద ఫోటో యాప్‌ అవిశ్వాస దావా వేసింది. ప్రస్తుతం మనుగడలో లేని ఫోటో యాప్‌లోని ఫీచర్లను ఫేస్‌బుక్ తన సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ కోసం కాపీ చేసిందని ఆరోపించింది. ఫోటో యాప్‌లో ఉండే ఫైవ్ ఫ్రేమ్స్ ఫీచర్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో బూబరంగ్ ఫీచర్‌గా తీసుకొచ్చిందని.. మెటా.. తమ ఫీచర్లను అన్నింటినీ క్లోన్ చేసిందని ఆరోపించింది. అలాగే.. ఇన్‌స్టాగ్రామ్ ఏపీఐ నుంచి తమ యాప్‌ను బ్లాక్ చేశారని ఫోటో యాప్ సంస్థ స్పష్టం చేసింది. దీని వల్ల మా యాప్ వాడకం తగ్గిపోయి.. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు పెరిగారు. కేవలం మా ఫీచర్‌ను క్లోన్ చేసి ఇన్‌స్టాలో వాడుకొని మా యాప్‌ను ఫేస్‌బుక్ దెబ్బకొట్టింది. యాప్ ప్రారంభమైన మొదట్లో తమ యాప్‌కు నెలకు 3.7 మిలియన్ యూజర్లు వచ్చేవారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా మా యాప్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం మా యాప్ మనుగడలో లేకపోవడానికి పూర్తి బాధ్యతను వహిస్తూ.. ఫేస్‌బుక్ మా సంస్థకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫోటో సంస్థ ఫిర్యాదు చేసింది. ఫోటో యాప్ ఆరోపణలపై స్పందించిన మెటా కంపెనీ ప్రతినిధి.. అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని కొట్టిపారేశారు. కోర్టులోనే తాము కూడా తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu