Ad Code

గంగూలీతో విభేదాలు నిజమే

 

2016లో తనకు నాటి క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీకి మధ్య మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశాడు. నాడు టీమిండియా హెడ్‌ కోచ్ పదవి కోసం జరిగిన ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ సీఏసీ సభ్యులుగా ఉన్నారని, ఆ ఇంటర్వ్యూకి వెళ్లేముందు తాను హెడ్ కోచ్‌గా అయితే ఏమేం చేయగలనో ఓ లెటర్ రాసి పెట్టుకున్నానని తెలిపాడు. అయితే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి ఆ లెటర్‌ మిస్‌ అయ్యిందని, కమిటీ ముందు ఆ విషయం చెప్పడం నాకు చిన్నతనంగా అనిపించిందని, అందుకే ఉన్న విషయం కమిటీ ముందు చెప్పగా నా గురించి బాగా తెలిసిన గంగూలీకి అది నచ్చలేదని తెలిపాడు. ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ మీడియా దాన్ని ఎక్కువ చేసి ప్రచారం చేసిందన్నాడు. గంగూలీది, తనది చాలా పాత పరిచయమని, గంగూలీ తనకు జూనియర్‌ అని, గతంలో దాదా.. టైమ్స్ షీల్డ్ టోర్నీలో టాటా స్టీల్‌కి ఆడుతున్నప్పుడు తాను కెప్టెన్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా, 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక టీమిండియాపై కోచ్‌ రవిశాస్త్రి ప్రభావం తగ్గిందన్న వార్తలు చాలాకాలం వరకు వినిపించాయి. తాజాగా రవి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ వార్తలు వాస్తవమేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచ కప్-2021తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో.. గంగూలీ తన ఆప్తుడైన రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu