Ad Code

బంగ్లాదేశ్‌లో పౌల్ట్రీల్లో సూపర్‌ బగ్స్?

 

యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం వల్ల కోళ్ల పెంపకంలోనూ పలు సమస్యలు ఎదురవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో పౌల్ట్రీ పెంపకంలో మితిమీరిన యాంటీబయాటిక్‌ల వినియోగం వల్ల “సూపర్‌ బగ్స్” ఏర్పడుతున్నాయి. దీనిని సంప్రదాయ చికిత్సా పద్ధతులతో నివారించడం అసాధ్యం. బంగ్లాదేశ్ లైవ్‌స్టాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో ఢాకాలోని 29 మాంసం మార్కెట్‌ల నుంచి సేకరించిన చికెన్ శాంపిల్స్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. వీటి ఇమ్యూనిటీ పవర్ 6.7 నుంచి100 శాతం వరకు ఉంటుంది. ఇది చాలా డేంజర్. ప్రజారోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. పౌల్ట్రీ, జంతువుల పేగులలో నివసించే ఇటువంటి బ్యాక్టీరియా మానవుల కడుపులోకి చేరుతుందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. డబ్ల్యూ హెచ్ ఓ  ప్రకారం సాల్మొనెల్లా మానవులలో అతిసార వ్యాధిని కలిగించే కారకాలలో ఒకటి. బాయిలర్‌ చికెన్ ఉత్పత్తిలో యాంటీ బయాటిక్స్ అత్యధికంగా వాడుతున్నారు. ఆ తర్వాత సోనాలి చికెన్ ఉత్పత్తిలో వాడుతున్నారు. దీనివల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా విస్తరిస్తోంది. ఫిబ్రవరి, డిసెంబర్ మధ్య కాలంలో అనేక రకాల సాల్మొనెల్లా బ్యాక్టీరియా విస్తరించింది. పౌల్ట్రీ ఫామ్‌లలో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. యాంటీ బయాటిక్స్‌ ఎక్కువగా వినియోగించడం వల్ల సూపర్‌బగ్స్‌ ఏర్పడుతున్నాయి. వాస్తవానికి ప్రజల ప్రాణాలను కాపాడటంలో యాంటీ బయాటిక్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి.1940లో అందుబాటులోకి వచ్చిన పెన్సిలిన్‌ మొదలు అనేక రకాల యాంటీ బయాటిక్స్‌ నేడు వైద్య చికిత్సలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి రోగి శరీరంలో వ్యాధి కారకాలైన బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ తదితరాలను గుర్తించి నాశనం చేస్తాయి. కాలక్రమంలో కొన్ని బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లు మార్పు చెందుతూ ఈ మందులకు ఎదురొడ్డి నిలిచేలా శక్తిమంతమౌతాయి. కొంత కాలానికి చికిత్సకు లొంగని స్థాయికి చేరతాయి. వైద్యానికి తలవంచని అలాంటి మొండి ఘటాలను 'సూపర్‌బగ్స్‌'గా వ్యవహరిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu