Ad Code

కలవర పెడుతోన్న వాయు కాలుష్యం

 


వాయు కాలుష్యం రోజురోజుకలవర పెడుతోన్న వాయు కాలుష్యం
వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న సాంకేతికతతో పాటు పరిశ్రమల స్థాపన, వాహనాలు పెరుగుదల, పండుగల సమయంలో బాణాసంచాను కాల్చడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7.5 శాతం కాలుష్యం పెరిగినట్లు పీసీబీ అధికారుల లెక్కల్లోనే వెల్లడవుతోంది. ఇలాగే పెరిగితే భవిష్యత్‌లో ప్రమాదమని, మానవ మనుగడకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం పెరుగుతోందని, గాలినాణ్యత సూచితో 0-50 పాయింట్లు ఉంటే మంచి వాతావారణం అని అధికారులు పేర్కొంటున్నారు. 50 నుంచి 100 పాయింట్లకు పెరిగితే ఆరోగ్యపరంగా సున్నితంగా ఉండేవారిపై ప్రభావం చూపుతోందని, 101 నుంచి 200 పాయింట్ల మధ్య ఉంటే ఆస్తమా, గుండె జబ్బులు, 201 పాయింట్ల నుంచి శ్వాస సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ నాళికలలో ఉండే శ్లేష్మం తీవ్రంగా ప్రభావితమైంది. వాటిల్లో వాపు వల్ల సామాన్యులకు దగ్గు, జలుబు సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. గాలిలో కాలుష్య కారకాలు పెరగడం వల్ల ఆస్తమా, సీఓపీడీ, క్రానిక్ పల్మనరీ లంగ్ డిసీజ్ రోగుల సమస్యలు సాధారణ రోజులతో పోలిస్తే పెరిగినట్లు వైద్యుల అంచనా. ఇదిలా ఉంటే ఈ చలికాలం సీజన్‌లో బలమైన గాలి లేకపోవడం వల్ల, గాలిలో ఉండే కాలుష్యం శ్వాసకోశ సంబంధిత వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను పెంచుతోంది. రోగనిరోధక శక్తి పరంగా బలహీనమైన వ్యక్తులకు ఈ వ్యాధులు సులభంగా అంటుకుంటాయి. చెత్తను కాల్చడంతో పాటు వాహనాలు, పరిశ్రమలతో నిత్యం 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతాయి. వీటిలో సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు అత్యంత ప్రమాదకరం. మనిషి తల వెంటుక మందం 50 మైక్రోగ్రాములు ఉంటాయి. 5 రెట్లు తక్కువగా ఉండే సూక్ష్మ ధూళి కణాలు… స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. తలవెంట్రుక మందంలో ఉండి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యల కారణమవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu