Ad Code

రెండున్నర వేలకే వాషింగ్ మెషిన్, నో కరెంట్.......!


ఈ అమ్మాయి పేరు రమ్యజోస్  కేరళకు చెందిన ఒక బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్ వయసుకే ఆమె కనిపెట్టిన యంత్రంతో అంతర్జాతీయ ఇన్నోవేషన్ అవార్డు దక్కించుకుంది. ఆమె ఇన్వెన్షన్ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు ఎంతో ఉపయోగకరమైనది. ముఖ్యంగా కరెంటు సమృద్ధిగా లేని భారతదేశం వంటి దేశాలకు ఉపయోగపడేలా రమ్య ఓ వాషింగ్ మెషీన్ ను రూపొందించింది. చిత్రమేంటంటే పనితీరులో మీరు బయట కొనే వాషింగ్ మెషీన్ లాగే ఫలితాలు ఇచ్చే ఈ యంత్రం విలువ కేవలం రెండున్నర వేలు మాత్రమే. బోనస్ ఏంటంటే దీనికి కరెంటు అవసరం లేదు. ఈ ఇన్వెన్షన్ వల్ల డబ్బు, విద్యుత్తు ఆదా కావడమే కాకుండా బట్టలు ఉతకడానికి అనేక ఇబ్బందులు పడే గ్రామీణ ప్రజల కష్టాలు తీరుస్తుంది. సైకిల్ మోడల్ లో పనిచేసే ఈ యంత్రం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంది. ఈ యంత్రం కనిపెట్టడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది. రమ్య తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే. అయితే, ఇద్దరూ అనారోగ్యం పాలవడంతో చిన్న వయసులోనే ఇంటి పనుల భారం ఈ పిల్లల మీద పడింది. ఇంటి పనుల వల్ల చదువుకోవడానికి కుదరకవీరిద్దరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈశ్రమను ఎలా తగ్గించవచ్చో అని ఆలోచిస్తున్న రమ్యకు వచ్చిన ఆలోచనే ఈవాషింగ్ మెషీన్. ఆమె దీనిపై ఒక అధ్యయనం కూడా చేసింది. మెకానిక్ షాపు వద్దకు వెళ్లి వారి సాయంతో అసలు వాషింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుంది, అందులో ఏం ఉంటాయి, అది ఎలా పనిచేస్తే బట్టలు శుభ్రం అవుతున్నాయనే విషయాన్ని ఒక వేసవి కాలమంతా ప్రతిరోజూ వెళ్లి తెలుసుకుని, టెక్నికల్ గా పలు డయాగ్రామ్స్ గీసుకుని చివరకు ప్రస్తుతం ఉన్న యంత్రానికి రూపం పోసింది రమ్య. దీనికి పేటెంట్ కూడా పొందింది. 

Post a Comment

0 Comments

Close Menu