Ad Code

జుట్టు రాలకుండా ఉండడానికి చిట్కాలు!


పోషకాహారలోపం, హార్మోన్ల అసమతౌల్యత, థైరాయిడ్‌ వంటి కారణాలతో జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడానికి చెక్ పెట్టాలంటే కొన్ని నియమాలు పాటించాలి. నిమ్మ రసాన్ని నీటిలో కలిపి తలకు రాసి అరగంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు, రెండు స్పూన్ల టీ పొడి వేసి మరిగించాలి. నీటిని వడకట్టి ఆ నీటిలో షాంపూ కలిపి తలస్నానము చేస్తే జుట్టు రాలటం తగ్గటమే కాకుండా జుట్టు పట్టులా మారుతుంది. మెంతులను పెరుగులో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి. ఈ విధంగా చేయటం వలన జుట్టు రాలటం మరియు జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఒక కప్పు నీటిలో వేపాకులను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తలకు రాసుకొని అరగంట అయ్యాక తలస్నానము చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. పావులీటరు నీటిలో ఐదు మందార పువ్వులు, గుప్పెడు మందార ఆకులు, నాలుగు చుక్కల నీలగిరి తైలం, గుప్పెడు తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తలకు రాసుకొని అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.

Post a Comment

0 Comments

Close Menu