Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, November 23, 2021

భారం కానున్నవోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

 

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచింది. పెరిగిన ఈ ధరలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయి. అంతకుముందు ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు షాకిస్తూ ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం అదే బాటలో వొడాఫోన్ ఐడియా కూడా వెళ్తుండడంతో ఇక నుంచి వినియోగదారులపై మరింత భారం పడనుంది. వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరల ప్రకారం, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న అతి చౌకైన ప్లాన్ ప్రస్తుతం రూ. 99గా మారనుంది. ఇంతకుముందు ఈ ప్లాన్ రూ.76కి అందుబాటులో ఉండేది. ఈ ప్లాన్‌లో రూ. 99 టాక్ టైమ్, 200MB డేటా, సెకనుకు ఒక పైసా వాయిస్ టారిఫ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. రూ.149 ప్లాన్ ఇప్పుడు రూ.179కి రానుంది. ఇందులో, అపరిమిత కాలింగ్, 300 SMSలు, 2GB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. రూ.219 ప్లాన్ ఇప్పుడు రూ.269కి అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కింద, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1GB డేటా అందివ్వనున్న ఈ ప్లాన్ కూడా 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం రూ. 299కి రానుంది. దీని వాలిడిటీ 28 రోజులే. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1.5GB డేటా అందుబాటులో ఉంటుంది. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.359కి అందుబాటులో ఉంటుంది. దీని కింద, అపరిమిత కాలింగ్ ప్రయోజనం, రోజుకు 100 SMSలతోపాటు రోజుకు 2GB డేటా 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ.479కి పెంచారు. దీని వాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1.5GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది. రూ.449 ప్లాన్ ఇప్పుడు రూ.539కి అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 56 రోజులు కాగా, ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో పాటు రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటా అందుబాటులో ఉంటుంది.

No comments:

Post a Comment

Popular Posts