Ad Code

'చ'కారకుక్షి

 

కాళిదాసు కు  వ్యాసు డంటే చాలా గౌరవం. అయన శ్లోకాలలో 'చ' (మరియు) అనేది ఎక్కువగా వస్తూ వుంటుంది. కాళిదాసు ఆయన తన మిత్రులతో ఈయన చకార కుక్షి అని తమాషాగా అంటూ వుండే  వాడు. వ్యాసుడు పంచమ వేదమైన భారత యితిహాసాన్నీ, అష్టాదశ పురాణాలను వ్రాసినవాడు.మొత్తం 4 లక్షలకు పైన  శ్లోకాలు వ్రాసినవాడు. పోలిక చెప్పాలంటే కాళిదాసు రచనలన్నింటి లో కలిపి 6 వేల శ్లోకాలకు మించి వుండవు. అంత ఎక్కువ సంఖ్యలో గ్రంథాలు వ్రాసేటప్పుడు వాటిలో అవసరాన్ని బట్టీ, ఒక్కోకప్పుడు ఛందస్సు పాత్న్చడం కోసం 'తు' (అంటే అయితే) 'చ' (అంటే మరియు)లాంటి మాటలు వాడక తప్పదు. వంశ చరిత్రలూ, రాజుల పేర్లూ, ఋషుల పేర్లు, దేశచరిత్రలు, చెప్పేటప్పుడు 'చ'కారం వాడడం తప్పనిసరి. ఈ విషయాలు కాళిదాసు  ఎరుగానివి కాదు. కాళిదాసు వ్యాసుడిని 'చ'కారకుక్షి అనడం ఆ మహానుభావుడిని కించపరచాలనే ఉద్దేశ్యం తో కాదు. వ్యాసుడి రచనా వ్యాసంగం లో వున్న కష్టము, పాండితీ ప్రకర్ష , ప్రతిభ కాళిదాసు గుర్తించినట్లు సామాన్యులు గుర్తించ లేరు. మునిమనుమడిని (అలా కాళిదాసు చెప్పుకునేవాడు) అనే చనువుతోమా తాతగారి పొట్టలో అన్నీ 'చ'కారాలే ఈయన 'చ'కార కుక్షి అని తమాషాగా అనేవాడు. ఒకసారి కాశీ లోకాళిదాసుకు  వ్యాసుడి  విగ్రహం కనిపించింది. సాష్టాంగ నమస్కారం చేసి  ఆయన బొడ్డులో వేలు పెట్టి ఈయన కడుపులో అన్నీ 'చకారాలే' చకార కుక్షి.కాసిని తీసుకొని నేను నా గ్రంథాల్లో వాడుకుంటాను. అన్నాడు. మరీ తీసుకుండా మంటే  వేలు రాలేదు  అలాగే అతుక్కు పోయింది యెంత లాగినా రాలేదు. అప్పుడు కాళిదాసు తాతగారూ ఏదో ముని మనుమడిని కదా చనువుతో అలా అన్నాను. మీరంటే నాకు ఎంతో భక్తి, గౌరవము  క్షమించి వదిలి వేయండి అని అన్నాడు. అప్పుడు వ్యాసుడి   విగ్రహము లోనుంచి నీకు చాలా గోప్పకవినని అహంకారం ఎక్కువై విర్రవీగి పోయి పెద్దవాళ్ళని యెగతాళి చేస్తున్నావు. నేను ఎన్నో పురాణాలు వ్రాసి వేలకొలది పాత్రలతో వందలకొద్దీ చరిత్రలు వర్ణించిన వాడిని. నీలాగా ఏ పురాణం లోనుంచో ఒక చిన్న ఘట్టం తీసుకొని దాన్నే సాగదీసి గ్రంథాలు గా వ్రాయలేదు. అనేక పాత్రల గురించి చెప్పాలంటే 'చ'కారం వాడడం తప్పనిసరి. దాన్ని పట్టుకొని నన్ను గేలి చేసినందుకు నీ కీ  శిక్ష.అప్పుడు కాళిదాసు మీరు చెప్పింది నిజమే  నాది తప్పే చెంపలేసుకుంటాను. నన్ను క్షమించి వదిలేయండి అని బ్రతిమాలాడు. శిక్ష   తప్పించుకోవాలంటే నేను ఒక ఘట్టాన్ని చెప్తాను దానిలో 'చ'కారాలు లేకుండా శ్లోకం చెప్పగలిగితే వదిలేస్తాను. అన్నాడు. చెప్పండి తాతగారూ! నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను.అన్నాడు కాళిదాసు.  ద్రౌపదికి ఐదుగురు భర్తలు, ధర్మరాజు తమ్ముళ్ళు ఆమెకు మరిది వరుస అవుతారు. అలాగే చిన్నావాడైన సహదేవుడి అన్నలు నలుగురు బావ వరుస అవుతారు. ధర్మరాజు ఆమెకు మరిది కాడు, సహదేవుడు ఆమెకు బావ కాడు. ఇలాగ చెప్పాలంటే 'చ'కారాలు లేకుండా సాధ్యమవుతుందా? 'చ'కారాలు లేకుండా శ్లోకం చెప్పు అన్నాడు. కాళిదాసు ప్రయత్నిస్తాను తాతగారూ అని కింది శ్లోకం చెప్పాడు.

"ద్రౌపద్యా:పాండు తనయా: పతి దేవర భావుకాః 

న దేవరో ధర్మరాజః సహదేవో భావుకః 

అని 'చ'కారాలు లేకుండా చెప్పాడు. యిలా చెప్తే మీరడిగిన భావం వస్తుందనుకుంటాను తాతగారూ! అన్నాడు.

అర్థము:-- ద్రౌపదికి పాండుపుత్రులు భర్తలు. మరిది బావ వరుస కూడా. కానీ ధర్మరాజు మరిది కాడు సహదేవుడు బావ కాడు. వ్యాసుడు శభాష్ మనవడా! చక్కగా చెప్పావు.అని  మెచ్చుకొని నీవు నీ ప్రతిభ వుపయోగించి మరిన్ని మహా కావ్యాలు వ్రాయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. వేలు వదిలేశాడు. వ్యాసుడు కాళిదాసు గొప్పతనం లోకానికి తెలియాలనే యిదంతా చేశాడు.అని అంటారు. కాళిదాసు వేలు తీసేసుకొని మహా ప్రసాదం ఋషీ శ్వరా! యింక ముందు పరిహాసానికి కూడా మీ లాంటి మహానుభావులను కించపరిచే పొల్లు  మాటలు మాట్లాడను.అని చెంప లేసుకొని సాష్టాంగ  ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. కాళిదాసు కవిత్వం లో .'చ'కారాలు తక్కువగా కనిపిస్తాయి.'హి' 'ఖ' లు కనిపిస్తాయి.అవి అయన వాడే ఊత పదాలు.


Post a Comment

0 Comments

Close Menu