నోటికి తాళం వెయ్యి
నోట్లో నువ్వు గింజ నానదు
నోరెళ్ళబెట్టాడు
బోసి నవ్వుల బాపుజీ
నోరార పిలవడం
నోటికొచ్చింది వాగడం
నోట్లో నాలుకే లేదు
నోరు చేసుకోవడం
నోరున్నోడితే రాజ్యం
నోరు తడారి పోవడం
నోట్లో నీళ్ళూరుతున్నాయా
నీ నోటి మాటకి నోచుకోలేమా
నోటి దుర్వాసన
తాంబూలం తో పండిన నోరు
వేనోళ్ళ పొగడడం
నోరు తీపి చేసుకుందామా
నోరు చేదుగా ఉంది,జ్వరంగదా
నోటితో నవ్వడం నొసలుతో వెక్కిరించడం
నూనే పుక్కలించు
నోటి నిండా గాలి పీల్చుకున్నారు
నిట్టూర్పు
నోటికి తాళంవేయి
పాచి నోరు
నోరు నొక్కుకోవడం
పేలపిండి నోటి నిండా పోసుకోవడం
నిజం పలికే నోరు
పిల్లి బిడ్డను నోట కరచిపట్టుకుంటుంది
నోటి నిండా పళ్ళు
నోట్లో వేలు పెట్టినా కొరకలేడు
అవాకులు చెవాకులు పలకకు
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసడా
నోటికి చేతికి అడ్డేముంది
నోరు కట్టుకొని సంపాదిచాం
నోటిని అదుపులో ఉంచుకో
నోటికెంతొస్తే అంతేనా
ఆమె నోట్లో నోరు పెట్టామంటే ఇకంతే
నోరు జారితే తీసుకోలేము
నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం
నోరు తీపి చేద్దామని
నోరు తినమంటుంది పొట్ట వద్దంటుంది
నోరు తీపి కడుపులో విషం
బుగ్గల్లోనే బూరేలొండి పెడుతుంది ఆమె
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది
అలా నోరు పారేసుకోక.
ఈయేడు వర్షం లేకపోతే నోటమట్టే
ఆమె నాలుక భుజానేసుకోని తిరుగుతుంది
ఆమె ఆలిండియా రేడియో వార్తలకు కొదువలేదు
నోరు మూసుకో
వాగుడు కాయ
నలుగురు నోట్లో గడ్డి పెడతారు
నలుగురు నవ్విపోతారు
నవ్వుకోనీ నాకేటి సిగ్గు అందట
నోరు మంచిదైతే,ఊరు మంచిది
No comments:
Post a Comment