Ad Code

కామ్రేడ్ బాలకృష్ణన్ కు సూర్య లేఖ

  గౌరవనీయులు బాలకృష్ణన్ గారికి,

నమస్కారం. మీరు పంపిన అభినందన లేఖ అందుకున్నాను. జై భీం చలన చిత్రం గురించి మీ ప్రశంసలకు ధన్యవాదాలు. పీడిత ప్రజానీకానికి అన్యాయం జరిగినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం, ఆ సిద్ధాంతాలను తమ జీవన శైలి గా మార్చుకున్న ఉద్యమకారులు వారికి అండగా ఉండడం గమనించి గర్విస్తున్నాను. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమం అందిస్తున్న మహత్తర సేవలను సినిమా లో వీలున్నంత మేరకు ప్రాధాన్యత ఇచ్చి చిత్రీకరించడం జరిగింది. న్యాయ మూర్తి చంద్రు, నిజాయితీ పరుడైన పోలీస్ ఉన్నతాధికారి పెరుమాళ్ స్వామి గురించి కూడా చూపడం జరిగింది.  దివంగత రాజకన్ను సతీమణి పార్వతి అమ్మాళ్ గారికి, వారి కుటుంబానికి జీవితాంతం తోడ్పాటు ఇచ్చేలా సాయం చేయాలని ఆలోచిస్తున్నాము. వృద్ధాప్యంలో ఉన్న ఆమె జీవితాంతం ఆదాయం పొందేలా ఆమె పేరు మీద రూ.పది లక్షలు డిపాజిట్ చేసి నెలసరి వడ్డీ ఆమె పొందేలా ఏర్పాటు చేస్తున్నాము. ఆమె అనంతరం ఆమె వారసులకు ఆ నగదు అందేలా పథకం రూపొందించాము. ఇంకా కురవర్ గిరిజన పిల్లల విద్య నిమిత్తం చేయవలసిన తోడ్పాటు గురించి కూడా ఆలోచిస్తున్నాము. వారి ఉజ్వల భవిష్యత్తు కు బాట వేయగలిగింది విద్య మాత్రమే. అందుకే జై భీం సినిమా ద్వారా ఇరులర్ గిరిజన పిల్లల వైద్య కోసం తోడ్పాటు అందించాము. మీ ఉద్యమం ప్రజల పట్ల చూపుతున్న సానుభూతి, ప్రజల మేలు కొరకు మీరు చేపడుతున్న కార్యక్రమాలకు హృదయపూర్వక అభినందనలు. ప్రజా క్షేత్రంలో మీ సేవలు నిరంతరం కొనసాగాలని కోరుతున్నాను. మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.

ప్రేమతో

సూర్య.

Post a Comment

0 Comments

Close Menu