Header Ads Widget

నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్​ రికార్ట్స్‌లో అల్లు అర్హ

 

అల్లు అర్జున్‌, స్నేహాల గారాల పట్టి అర్హ ఓ చెస్‌ అకాడమీలో శిక్షణ తీసుకుని ఇతరులకు చెస్‌ నేర్పించడం ప్రారంభించింది. ఇలా రెండు నెలల్లోనే ఏకంగా 50 మందికిపైగా చెస్‌లో ట్రైనింగ్‌ ఇచ్చింది. దీంతో అర్హ అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ ప్రతినిధులు అర్హ నైపుణ్య పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హ తన సత్తా చాటడంతో వరల్డ్‌ యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌గా అవార్డును అందించారు. ఇక అర్హ చెస్‌ పరీక్షలో పాల్గొన్న సమయంలో తీసిన వీడియోను అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన బన్నీ అభిమానులు అర్హపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు అర్హ 5వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇలా పుట్టిన రోజున తన పేరెంట్స్‌కు మరిచిపోలేని బహుమతి ఇచ్చింది అర్హ.

Post a Comment

0 Comments