Ad Code

మూత్రం ఎరుపులో రంగులో ఉంటే....?

 

మానవుడి శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలలో మూత్రం ఒకటి. కిడ్నీలు రక్తాన్ని వడబోయగా అందులో ఉండే వ్యర్థ పదార్థాలు మూత్రంగా వస్తాయి. అనారోగ్య సమస్యలను నివారించేందుకు వైద్యులు ముందుగా యూరిన్ టెస్ట్ చేస్తారు. మూత్రం రంగును బట్టి శరీరంలోని వ్యాధులు తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఏదైనా ఔషధాల వల్ల , మూత్రపిండాల్లో రాళ్లు, రేడియేషన్ థెరపీ కూడా సమస్యను కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో చెడు బ్యాక్టీరియా మూత్రాశయం లేదా మూత్రనాళంలో పెరుగుతూ కిడ్నీకి చేరుకుంటుంది. ఈ స్థితిలో మూత్రంలో వాసన, రంగు కూడా మారుతుంది. మూత్రం పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటే మూత్ర నాళంలో రక్తస్రావం ఉందని అర్థం. ఇది చాలా ప్రాణాంతకం. మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించినా లేదా మూత్రం రంగులో మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. క్యారెట్, బీట్ రూట్ ఎక్కువ తింటే మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటుంది. అవేమీ తీసుకోకుండానే మూత్రం రంగు గులాబీ లేదా ఎరుపుగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి. మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కేవలం మూత్రం ద్వారా మాత్రమే తెలియవు. చాలా సార్లు, నడుము దిగువ భాగంలో స్థిరమైన, పదునైన నొప్పి ఉంటుంది. ఇవన్నీ కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఇలాంటివి లక్షణాలుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ఈ సమస్యకి ఎక్కువ కాలం చికిత్స చేయకపోతే అది మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. అటువంటి సందర్భాలలో రోగి జీవితాన్ని కాపాడటానికి అతని కిడ్నీ మార్పిడి చేయవలసి ఉంటుంది. గులాబీ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తే మూత్రపిండ వ్యాధులు, కణతులు, లివర్ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. అలాకాకుండా ఎరుపు, పింక్ రంగులో ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నా కూడా రంగు మారే అవకాశాలున్నాయి. ఇది డైసూరియా వ్యాధి లక్షణం కావచ్చు. మూత్రంలో ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వల్ల ఈ రకమైన సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. ఇది చెడ్డ ఆహారపు అలవాట్లు లేదా మూత్రనాళంలో ఏదైనా బ్యాక్టీరియా ఉండటం వల్ల జరుగుతుంది. మూత్రం తేనె రంగులో కనిపిస్తే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై యూరిన్ రంగు మారుతుంటుంది. దీనికి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాతం నీరు తీసుకుంటే సరిపోతుంది. లేతపసుపు రంగులో మూత్రం ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది మీ శరీరం నుంచి మురికి, చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అప్పుడే మూత్రనాళం పూర్తిగా శుభ్రంగా ఉంటుంది. ఇది కాకుండా మీ ఆహారం, జీవనశైలిని సరిగ్గా ఉంచడానికి మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవద్దు. సమస్యను గమనించిన వెంటనే చికిత్స పొందేందుకు ప్రయత్నం చేయండి. పరిస్ధితి చేయిదాటిపోయేంత వరకు అశ్రద్ధ వహించవద్దు.

Post a Comment

0 Comments

Close Menu