Ad Code

12 మాల్వేర్‌ యాప్స్‌తో జాగ్రత్త !

 

గూగుల్‌ ప్లే స్టోర్‌లోని 12 మాల్వేర్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. వీటిని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత యాప్స్‌లోని అప్లికేషన్లు హానికరమైన మాల్వేర్‌ కంటెంట్‌ను డివైస్‌లోకి ప్రవేశపెడతాయ న్నారు. క్యూఆర్‌ స్కానర్‌, క్యూఆర్‌ స్కానర్‌ 2021, పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ స్కానర్‌ ఫ్రీ, పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ స్కానర్‌, టూ ఫ్యాక్టర్‌ అథంటికేటర్‌, ప్రొటెక్షన్‌గార్డ్‌, క్యూఆర్‌ క్రియేటర్‌ స్కానర్‌, మాస్టర్‌స్కానర్‌ లైవ్‌, క్రిప్టోట్రాకర్‌, జిమ్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌లను మాల్వేర్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌గా థ్రెట్‌ఫ్యాబ్రిక్‌ సంస్థ పరిశోధకులు గుర్తించారు. ఈ యాప్స్‌కు 3 లక్షల డౌన్‌లోడ్స్‌ ఉన్నాయన్నారు. యూజర్ల ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను, టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ కోడ్స్‌ను దొంగిలించేలా వీటిని డిజైన్‌ చేసారని తెలిపారు. ఈ మాల్వేర్‌ ఫోన్‌లో యూజర్‌ చేసే టైపింగ్‌ను తెలుసుకుంటుందని, యూజర్‌ ఫోన్ల స్క్రీన్‌షాట్స్‌ను తీసుకుంటుంద న్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్స్‌కు అనుకూల సమీక్షలు ఉంటాయని, దీంతో అవి ప్రయోజనకర మనే భావన కలిగిస్తాయని నిపుణులు వివరించారు. ఇటువంటి హానికారకమైన యాప్స్‌ ప్లే స్టోర్‌లో ప్రవేశించకుండా, పలు నియంత్రణల్ని గూగుల్‌ అమలు చేస్తున్నా, గూగుల్‌ ప్లే స్టోర్‌ వీటిలో మాల్వేర్‌ను గుర్తించలేకపోతున్నది. ఎందుకంటే ఇవి చాలా చిన్న మాల్వేర్‌ ఫుట్‌ప్రింట్‌ను కలిగి ఉన్నందున, ఈ యాప్స్‌ను కనుగొనడం కష్టతరమవుతున్నది. మాల్వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయకుండా యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమర్థవంతమైన యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే. అది డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతీ కొత్త యాప్‌ను స్కాన్‌ చేస్తుందని, అనుమానాస్పద యాక్టివిటీని పర్యవేక్షిస్తుందని నిపుణలు చెపుతున్నారు.


Post a Comment

0 Comments

Close Menu