Ad Code

స్పెషల్ కోడ్ నేమ్‌తో లాంచ్ కానున్న వన్ ప్లస్ నార్డ్ 2సీఈ


వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ పేరుతో 5G ఫోన్‌ను సంస్థ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. డివైజ్ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. ఈ వన్‌ప్లస్ నార్డ్-సిరీస్ ఫోన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అంచనా. ఈ డివైజ్ ఇవాన్  అనే కోడ్‌నేమ్‌తో రానుంది. ఈ సంవత్సరం జూన్‌లో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ డివైజ్‌కు తరువాతి వెర్షన్‌గా తాజా మోడల్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి ఫీచర్లతో లభిస్తుందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu